Saturn Award for RRR movie: జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్రదర్శనకి ఎంపికైన ఈ చిత్రం.. తాజాగా శాటర్న్ అవార్డు (Saturn Award) కూడా దక్కించుకుంది. సాధారణంగా అమెరికాలోని హాలీవుడ్‌ సినిమాలకు ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ కు దక్కింది. ఈ సందర్భంగా జ్యూరీకి థ్యాంక్స్ చెబుతూ వీడియో సందేశాన్ని పంపించారు రాజమౌళి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ఆర్ఆర్ఆర్ కు అవార్డు దక్కినందుకు సంతోషంగా ఉంది. బాహుబలి-2 తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డు ఇది. మా టీమ్ తరుపను జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. జపాన్ లో ఈ సినిమకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నందున రాలేకపోతున్నాను. విజేతలకు అభినందనలు'' అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. 



రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. అలియా భట్, శ్రియా, అజయ్ దేవగణ్ కీలకపాత్రల్లో నటించారు. 400 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం జపాన్ లోనూ రిలీజ్ అయి సత్తా చాటుతుంది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలిచిన సంగతి తెలిసిందే. 


Also Read: Veera Simha Reddy story leaked: రొటీన్ రొట్ట స్టోరీనా.. మరి అంత ధైర్యం ఎందుకబ్బా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook