Veera Simha Reddy story leaked: రొటీన్ రొట్ట స్టోరీనా.. మరి అంత ధైర్యం ఎందుకబ్బా?

Veera Simha Reddy leaked story: బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు దాని స్టోరీ లీకైంది. వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 25, 2022, 09:42 PM IST
Veera Simha Reddy story leaked: రొటీన్ రొట్ట స్టోరీనా.. మరి అంత ధైర్యం ఎందుకబ్బా?

Balakrishna’s Veera Simha Reddy leaked story: అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా  రూపొందుతున్న ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రకటించిన ఈ టైటిల్ మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా సరే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ అవుతుంది.

అదేమిటంటే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. తండ్రి కొడుకుల పాత్రలో ఆయన కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో కుమారుడి పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ ఫారిన్ లో ఒక బ్యాంకు మేనేజర్ గా పని చేస్తారని అక్కడ అతని కొలీగ్ గా శృతిహాసన్ కనిపించబోతుందని అంటున్నారు. శృతిహాసన్ తల్లితో కలిసి అక్కడ నివసిస్తూ ఉంటుందని అక్కడే బాలకృష్ణ ఆమెతో ప్రేమలో పడతారని అంటున్నారు.

ఇక మరోపక్క తండ్రి పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ రాయలసీమ జిల్లాల్లో ఒక ఫ్యాక్షన్ లీడర్ అని విలన్ చేతిలో ఆయన మరణించడంతో దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు యువ బాలకృష్ణ విదేశాల నుంచి తిరిగి వస్తారని అంటున్నారు. తండ్రి పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ సోదరి పాత్రలోనే వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతున్నారని ఆమె భర్తగా దునియా విజయ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. దునియా విజయ్ చేతుల్లోనే పెద్ద బాలకృష్ణ చనిపోతారని సొంత మామ మీద పగ తీర్చుకునేందుకు చిన్న బాలకృష్ణ విదేశాల నుంచి తిరిగి వస్తారని అంటున్నారు.

ఒకరకంగా చూస్తే ఇది కథగా కొత్తదేమీ కాదు గతంలో మనం అనేక సినిమాల్లో చూసిందే, కొత్త పాయింట్లు ఏమీ లేవు కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి వదిలితే మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించినట్లయితే థియేటర్కు ప్రేక్షకులను రప్పించే అవకాశం ఉంటుంది. మాస్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో మలినేని సిద్ధహస్తుడు కావడంతో ఈ సినిమా  అభిమానులు  ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే విడుదలైన కొన్ని చిన్న చిన్న వీడియోలు సినిమా మీద విపరీతమైన ఆసక్తి కలిగించాయి అని చెప్పక తప్పదు.

అలాగే ఈ సినిమాకు సింహ అనే టైటిల్ పెట్టడంతో అది కూడా బాలకృష్ణ రాయాలిటీకి తగినట్లుగా ఉందని అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ సూపర్ హిట్ లు అయ్యాయి కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనాలైతే ఉన్నాయి. మరి నిజంగా ఇదే కథతో సినిమా చేస్తున్నారు అంటే మైత్రి మూవీ మేకర్స్ వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. మరి చూడాలి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కథ ఇదేనా లేక లీకైన కథ వట్టి ప్రచారం మాత్రమే నా అనేది.
Also Read: Producer’s Master Plan: హేమాహేమీలతో అఖిల్ ఢీ కొట్టడానికి రెడీ అయ్యింది అందుకేనా.. మస్త్ ప్లాన్ ఇది!

Also Read: Chiranjeevi Tweet: మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.. బంజారాహిల్స్‌ ఘటనపై చిరంజీవి ఆవేదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News