Satyadev Krishnamma:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైవిద్యమైన కథలతో ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటారు హీరో సత్యదేవ్. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా కనిపిస్తూ మెప్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరో సూపర్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో రానుంది ఆయన చేసిన కృష్ణమ్మ సినిమా. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.


ఈ సందర్భంగా ఈ చిత్రం నిర్మాత కృష్ణా మాట్లాడుతూ.. ''కృష్ణమ్మ సినిమా రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకి రానుంది. టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్‌. ఆయన్ని ఈ చిత్రం కచ్చితంగ మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది'' అని అన్నారు.


దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా స్నేహం విలువను చూపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పాటలో హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. సినిమా చాలా చక్కగా వచ్చింది. తప్పకుండా ఈ సమ్మర్ కి ఈ చిత్రం సూపర్ హిట్ సాధిస్తుంది,” అని చెప్పారు. 


కాగా ఈ చిత్రంలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.  రఘుకుంచె, లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.


Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌


Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా


 



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook