Save The Tigers 2 Trailer Talk Review:  బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌ ' సేవ్ ది టైగర్స్‌' సీక్వెల్ 'సేవ్ ది టైగర్స్' సీజన్ ను రాబోతుంది. ఫస్ట్ సీజన్‌ ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. అంతేకాదు హాట్ స్టార్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొన్నాళ్లు పాటు నడిచింది. అంతేకాదు ఫన్ అండ్ ఫస్ట్రేషన్ లెవల్లో ఉన్న ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడీ సీజన్‌కు కొనసాగింపుగా సీజన్ 2 రాబోతుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం ఫన్నిగా సాగింది. మరోసారి భార్య బాధితులుగా మరోసారి కనిపించనున్నారు. ఈ సెకండ్ సీజన్ ఈ నెల 15వ తేది నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతుంది.మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌కు క్రియేటివ్ డైరెక్టర్స్‌గా పనిచేశారు. అరుణ్ కొత్తపల్లి డైరెక్టర్ చేసారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సేవ్ ది టైగర్స్ 2' ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ సిరీస్ కర్త, కర్మ, క్రియ మహీ వి రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్‌'కు సెకండ్ సీజన్ అనౌన్స్ చేయడంపై థ్రిల్‌కు గురైనట్టు చెప్పుకొచ్చారు. 'సేవ్ ది టైగర్స్‌' ఫస్ట్ సీజన్‌కు మించిన హ్యూమర్, సస్పెన్స్, ఫన్‌ను సీజన్‌ 2లో మీకు అందించబోతున్నట్టు చెప్పారు.




'సేవ్ ది టైగర్స్ 2' ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ బిగినింగ్ నుంచే ఫన్ రైడింగ్‌గా ఉంటూ హిలేరియస్‌గా సాగింది. వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా అభినవ్ గోమటం, ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్‌తో నవ్వించారు. సంసారంలోని ఒడిదుడుగులను రిలాక్స్ కావడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు హ్యూమరస్‌గా ఉన్నాయి. భార్యలకు ముద్ది చెప్పే భర్తలకు బుద్ది చెప్పే పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఈ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది ఈ వెబ్ సిరీస్‌లో ప్రధానంశం. మొత్తంగా ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. మొత్తంగా 'సేవ్ ది టైగర్స్‌ 2' ట్రైలర్ ఇంట్రెస్టింగ్ సాగింది.


Also ReadSnake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.