Sekhar Master : ఢీ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. స్టేజ్‌కు దండం పెడుతూ ఎమోషనల్
Sekhar Master Re Entry to Dhee ఢీ పదిహేనో సీజన్లో మళ్లీ శేఖర్ మాస్టర్ వచ్చాడు. పద్నాలుగో సీజన్ మధ్యలోనే శేఖర్ మాస్టర్ బయటకు వచ్చాడు. అయితే ఇక పూర్తిగా ఢీ నుంచి దూరమయ్యాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కొత్త సీజన్లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Dhee 15 Championship Battle promo బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్ ఇప్పటికీ హై స్పీడులో దూసుకుపోతోంది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఢీ అనేది డ్యాన్స్ షో కాదు.. కామెడీ షో అయిందంటూ ఎంతగా నెగెటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాగానే టీఆర్పీ రేటింగ్‌లు సాధిస్తోంది. ఇక ఇందులో ఎన్నెన్నో మార్పులు వచ్చేశాయి. జడ్జ్‌లు కాన్‌స్టంట్‌గా ఉండటం లేదు. మారుతూనే ఉన్నారు. టీం లీడర్లు మారుతున్నారు. కానీ ఒక్క హోస్ట్ ప్రదీప్ మాత్రం మారడం లేదు.
ఎన్ని సీజన్లు వస్తున్నా వెళ్తున్నా ప్రదీప్ మాత్రం హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఇక శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, గణేష్ మాస్టర్ ఇలా అందరూ మారుతూ వచ్చారు. లేడీ జడ్జ్‌లో ప్రియమణి వెళ్లిపోయింది. మధ్యలో నందితా వచ్చి వెళ్లింది. శ్రద్దా దాస్ కూడా మధ్యలో కనిపించింది. అయితే ఇప్పుడు ప్రారంభం అయిన కొత్త సీజన్లో శ్రద్దా దాస్ జడ్జ్‌గా వచ్చింది. శేఖర్ మాస్టర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
మల్లెమాలతో గొడవ జరిగిందని అందుకే ఈటీవీ నుంచి శేఖర్ మాస్టర్ దూరంగా వెళ్లిపోయాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ కోపంతోనే శేఖర్ మాస్టర్ స్టార్ మాలో చేరాడని, కామెడీ స్టార్స్ షోకు జడ్జ్‌గా చేశాడని గుసగుసలు వినిపించాయి. కానీ సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంం, డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం, స్టార్ మాతో ఉన్న కమిట్మెంట్లతోనే ఢీను వదిలేయాల్సి వచ్చిందని, మళ్లీ వాళ్లు పిలిస్తే వెళ్తాను అంటూ ఆ మధ్య శేఖర్ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
మొత్తానికి శేఖర్ మాస్టర్ ఈ పదిహేనో సీజన్‌కు జడ్జ్‌గా వచ్చాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మాకున్న కమిట్మెంట్లతో వెళ్తాం.. వస్తాం గానీ ఎప్పటికీ మా తల్లి.. ఈ తల్లే అంటూ ఢీ స్టేజ్‌ను ముద్దాడాడు శేఖర్ మాస్టర్.
Also Read : Urfi Javed Video : సిగ్గులేదంటూ పోస్ట్.. ఉర్ఫీ వీడియో వైరల్.. ఇంతకంటే దిగజారడం కష్టమేనేమో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook