Sekhar Master : ఫోన్‌లో వీడియోలు చూపించి మరీ అరాచకం.. శేఖర్ మాస్టర్ దెబ్బకు హడలిపోయిన శ్రద్దా దాస్
Sekhar Master satires on Dancer Pandu శేఖర్ మాస్టర్ తాజాగా డ్యాన్సర్ పండుని ఆడేసుకున్నాడు. అతని ఫోన్‌లోని వీడియోలను శ్రద్దా దాస్‌కు చూపించాడు. ఇక అందులో ఉన్న వాటిని చూసి శ్రద్దా దాస్ హవ్వా అంటూ నోర్మూసుకుంది.
Sekhar Master satires on Dancer Pandu శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఇప్పుడు మళ్లీ సందడి చేస్తున్నాడు. ఆ మధ్య కేవలం సినిమాలతో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్.. బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కనిపించేవాడు. అయితే శేఖర్ మాస్టర్ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై డ్యాన్స్ షోకు గెస్టుగా వచ్చేశాడు. ఢీ షోకు మళ్లీ శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కామెడీ షోకు గెస్టుగా పని చేశాడు.
ఇప్పుడు మాత్రం ఢీ షోలో శేఖర్ మాస్టర్ మళ్లీ సందడి చేస్తున్నాడు. ఆది, ప్రదీప్, శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కలిసి షోను బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది డ్యాన్స్ షో కంటే కామెడీ షోగానే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో డ్యాన్సర్ పండుని శేఖర్ మాస్టర్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు.
శేఖర్ మాస్టర్ తాజాగా పండుని ఆడుకున్నాడు. వేరే వాళ్లని ఇరికించాలని వచ్చిన పండుని ఆది ఇరికించాడు. ఫోన్‌లో ఏదో చూపించాలని పండు వచ్చాడు. చివరకు పండు ఫోన్‌లోని వీడియోలను శేఖర్ మాస్టర్ చూసి అవాక్కయ్యాడు. వీడియోలున్నాయ్ అని అరిచాడు. దీంతో శ్రద్దా దాస్ కూడా ఎంతో ఉత్సాహంగా వాటిని చూసేందుకు లేచింది.
దీంతో పండు ఆమెను వారించేందుకు ప్రయత్నించాడు. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం ఆమెకు చూపించాలని తెగ ఆరాట పడ్డాడు. చివరకు ఆ వీడియోలను చూసిన శ్రద్దా దాస్.. మొహం తిప్పేసుకుంది. నోరెళ్లబెట్టేసింది. అరిచేసింది. అలా మొత్తానికి పండు అందరి ముందు బుక్కయ్యాడు. ఇక ఇదే ప్రోమో చివర్లో పండుని అందరూ టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. పండు మైఖెల్ జాక్సన్‌లా అదరగొట్టేసినా కూడా కంటెస్టెంట్‌తో సరిగ్గా చేయించలేకపోయాడని కౌంటర్లు పడ్డాయి.
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook