Jaya Prada Latest News: సీనియర్ నటి జయప్రద ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి నీలవేణి మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాచారం తెలుసుకున్న నటి జయప్రద.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన పయనమయ్యారు. నీలవేణి మృతికి పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. జయప్రదకు సానుభూతిని తెలియజేశారు. 


జయప్రద సినీ ప్రయాణంలో ఆమె తల్లి నీలవేణిది కీలక పాత్ర ఉందని చెప్పుకొవచ్చు. ఎందుకంటే అనేక సినిమాల్లో నటించేందుకు తన తల్లి నీలవేణి సహకరించడం సహా అనేక సూచనలు ఇచ్చేవారని జయప్రద అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. 


అందంతో పాటు అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమనే కాకుండా.. భారతీయ చిత్ర సీమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు జయప్రద. భూమికోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. నటిగా జయప్రద.. 300 పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సేవ చేశారు జయప్రద.  


Also Read: Ariana Waist Kiss: అరియానా నడుముపై ముద్దు పెట్టిన జూనియర్ సమంత.. ఇదేం పనంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు


Also Read: Ananya Panday Photos: పొట్టి గౌనులో సందడి చేస్తున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook