Senior Comedian Bondamani passes away at 60: తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు బోండా మణి(60) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. గత ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు బోండా మణి. ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి చెన్నైలోని పోజిచలూరులోని తన నివాసంలో స్పృహతప్పి పడిపోయాడు.కుటుంబ సభ్యులు హుటాహుటిన క్రోంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మరణ వార్తను సినీ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ ధృవీకరంచారు. ఆయన అంత్యక్రియలు సాయంత్రం 5 గంటలకు క్రోంపేటలోని శ్మశానవాటికలో జరుగనున్నాయి. బోండా మణికి భార్య మాలతి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు దశాబ్దాలు పాటు ప్రేక్షకులను అలరించారు బోండా మణి.  తన కెరీర్ లో దాదాపు 270 సినిమాలకు పైగా నటించారు. 1991లో భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన '‘పౌను పౌనుతాన్స' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మణి. పొన్‌విలాంగు, పొంగలో పొంగల్, సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం వంటి చిత్రాల్లో తన నటన ద్వారా మంచి గుర్తింపు సాధించాడు. ముఖ్యంగా స్టార్ కమెడియన్ వడివేలుతో అత‌డు నటించిన సినిమాల‌కు ఆడియెన్స్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది.  బోండా మణి మరణ వార్తతో తమిళ ఇండస్ట్రీలో విషాదం ఛాయ అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. 


Also Read: Rashmika Mandanna: త‌న‌ బాయ్​ఫ్రెండ్‌ ఎవరో చెప్పేసిన రష్మిక మందన్నా, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook