G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత
G V krishna rao Death టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ జీవీ కృష్ణారావు కన్నుమూశారు. నేటి ఉదయం ఆయన మరణించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన ఎన్నో క్లాసిక్ చిత్రాలకు పని చేశారు.
G V krishna rao Death స్వర్గీయ కళాతపస్వీ కే విశ్వనాథ్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన జీవీ కృష్ణారావు మంగళవారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు.
దాసరి నారాయణరావు, కే విశ్వనాథ్, బాపు, జంధ్యాల ఇంతో మంది లెజెండ్‌ల వద్ద ఆయన పని చేశారు. ఆయన దాదాపు రెండొందలకు పైగా సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. ఇక కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం, శ్రీరామరాజ్యం, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సీతామహాలక్ష్మీ, నాలుగు స్థంభాలట వంటి సినిమాలెన్నింటికో ఎడిటర్‌గా పని చేశారు. ఇక ఆయన తన కెరీర్‌లో ఎక్కువగా పూర్ణోదయ, విజయ మాధవి వంటి నిర్మాణ సంస్థల్లో పని చేశారు.
ఈ మధ్యే కళాతపస్వీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణంతో టాలీవుడ్ మరింతగా కుంగిపోయి ఉంది. ఇప్పుడు ఇలా సీనియర్ ఎడిటర్ జీవీ కృష్ణారావు కన్నుమూశారు. కే విశ్వనాథ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న జీవీ కృష్ణారావు మరణంతో టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook