Sankranthi 2025: సంక్రాంతి 2025కి అప్పుడే రంగం సిద్ధం.. పోటీపడనున్న స్టార్ హీరోలు వీరే..
Tollywood Movies: సంక్రాంతి సినిమాల సందడి వేరుగా ఉంటుంది. టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు సంక్రాంతి సెంటిమెంట్ సీజన్. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండేలా లేదు.. ఎందుకంటే ఈసారి స్టార్ హీరోలు..ఒకరిని మించి ఒకరు సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Chiranjeevi: సంక్రాంతి అంటేనే సినీ లవర్స్ పండుగ.మామూలుగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎలా ఉన్నా సరే కలెక్షన్స్ బాగా వసూలు చేస్తాయి..మరి అలాంటిది స్టార్ హీరోలు సూపర్ కంటెంట్ సినిమాతో పోటీకి దిగితే ఎలా ఉంటుందో మనం ఈసారి సంక్రాంతికి చూసాము. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి ఇంతకు మించి అన్నట్లు ఉంటుంది. ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదల అవుతాయి అంటే.. థియేటర్లు పంచ లేక డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు.
చివరికి చేసేది లేక రవితేజ ఈగల్ పోటీ నుంచి తప్పుకో వలసి వచ్చింది. లేకపోతే థియేటర్ పంపకాల దగ్గర గొడవలు జరిగేవి.మరి అలాంటిది వచ్చే సంక్రాంతికి మెగాస్టార్, బాలయ్య కూడా బరిలోకి దిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మొన్న జరిగిన రచ్చ పుణ్యమా అని నిర్మాతలు సంవత్సరం ముందు నుంచే బాగా అలర్ట్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి హనుమాన్ కలెక్షన్స్ దంచి కొట్టింది. అయితే మరో పక్క గుంటూరు కారం, నాసామి రంగా చిత్రాలు మాత్రం తమ స్టామినాకి తగ్గట్లుగా బాక్స్ ఆఫీస్ ను వాడుకోలేదు. పోటి మరింత ఎక్కువ అయితే కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ సంక్రాంతికి అందరూ చూశారు.
అయితే ఇది చూశాక కూడా మన స్టార్ హీరోలు మాత్రం సంక్రాంతి బరిలో నిలవడానికి తగ్గేలా కనిపివ్వటం లేదు. 2025 సంక్రాంతి బరిలో దిగడానికి ముగ్గురు సీనియర్ హీరోలు సై అంటున్నారు. ఈ ముగ్గురిలో డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. రీసెంట్ గా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన చిరంజీవి ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నారు. పైగా జనవరి 10 మూవీ విడుదల చేయబోతున్నట్లు విశ్వంభర టీం అధికారికంగా పోస్టర్ని విడుదల చేసి ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి దిగుతున్నాడు అని స్పష్టమైనది.
ఇక సంక్రాంతి సోగ్గాడు నాగార్జున.. నా సామిరంగా సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కలుస్తాను.. అని ఇన్ డైరెక్ట్ గా సంక్రాంతి బరిలో తన చిత్రం ఉంటుందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ తో కలిసి చేస్తున్న.. మల్టీస్టారర్ కోసమా లేక నాగ్ ప్లాన్ చేస్తున్న బంగార్రాజు 3 కోసమా అన్న విషయం తెలియదు. సైంధవ్ అంటూ ఈ సంక్రాంతి కి వచ్చి నిరాశ చెందిన వెంకీ మామ.. వచ్చే సంక్రాంతికి లెక్కలు సరి చేయాలి అని భావిస్తున్నాడు. వెంకటేష్ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించాలని చూస్తున్నారు. మూవీ స్టోరీ ఫైనల్ అయిన వెంటనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.
మరోపక్క బాలయ్య.. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రాన్ని భగవంత్ కేసరి లాగా దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు. మూవీ షూటింగ్ బాగా టైం తీసుకోవడంతో అనుకున్న టైం కి పూర్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇదే జరిగితే బాలయ్య చిత్రం దసరాకి బదులు సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే సంక్రాంతి పోటీ మరింత రసవత్తంగా మారుతుంది. అంటే రాబోయే సంక్రాంతికి కూడా పోటీ మామూలుగా ఉండదు..
Also read: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
Also read: EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook