Shaadi Mubarak Teaser: మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌తో బుల్లితెర ఆడియెన్స్‌కి సుపరిచితుడైన సాగర్ ఆర్కే నాయుడు హీరోగా తెరకెక్కుతున్న సినిమా షాదీ ముబారక్. పద్మశ్రీ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మార్చి 5న ఆడియెన్స్ ముందుకు రానున్న సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాతలు షాదీ ముబారక్ టీజర్‌ను విడుదల చేశారు. సాగర్ ఆర్.కే. నాయుడుకి జంటగా ద్రిశ్య రఘునాథ్ అనే కొత్త హీరోయిన్ జంటగా నటిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Akshara Trailer: నేటి విద్యా వ్యవస్థను నిలదీసిన అక్షర ట్రైలర్


తనను పెళ్లి చేసుకోబోయే వాడి ఇంటి పేరు కూడా అందంగా ఉండాలనుకునే అమ్మాయికి సున్నిపెంట మాధవ్ అనే అబ్బాయి సంబంధం వస్తే ఎలా ఉంటుందనే కోణంలో కామెడి అల్లుకుంటూ పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కించాడు. చాలా కాలం తర్వాత సాగర్ హీరోగా తీస్తున్న సినిమా ఇది. Dil Raju నిర్మించిన Shaadi Mubarak movie అయినా Sagar RK Naidu ని వెండితెరపై హీరోగా నిలబెడుతుందేమో చూడాలి మరి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook