Shankar, Ram Charan, Dil Raju: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ !

Shankar to direct Ram Charan under Dil Raju Productions: మెగా పవర్ స్టార్ Ram Charan అభిమానులకు గుడ్ న్యూస్. సంచలన చిత్రాల దర్శకుడిగా పేరున్న Director Shankar దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందా అంటే అవుననే తెలుస్తోంది. Indian -2 చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ప్రముఖ నిర్మాత Dil Raju ప్రస్తుతం శంకర్‌ను మరో సినిమాకు ఒప్పించే పనిలో పడ్డాడు.

Last Updated : Feb 11, 2021, 11:36 PM IST
  • మెగా పవర్ స్టార్ Ram Charan అభిమానులకు గుడ్ న్యూస్.
  • Director Shankar దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందా ?
  • క్లైమాక్స్ స్టేజీలో RRR movie Shooting... ఆ తర్వాత వెంటనే చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ ?
  • రాంచరణ్, శంకర్ సినిమా ఓకే అవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న నిర్మాత ఎవరు ?
Shankar, Ram Charan, Dil Raju: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ !

Shankar to direct Ram Charan under Dil Raju Productions: మెగా పవర్ స్టార్ Ram Charan అభిమానులకు గుడ్ న్యూస్. సంచలన చిత్రాల దర్శకుడిగా పేరున్న Director Shankar దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందా అంటే అవుననే తెలుస్తోంది. గతంలోనే శంకర్ డైరెక్షన్‌లో Indian -2 చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ప్రముఖ నిర్మాత Dil Raju ప్రస్తుతం శంకర్‌ను మరో సినిమాకు ఒప్పించే పనిలో పడ్డాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న సినిమాలో నటించబోయే హీరో మరెవరో కాదు.. రామ్ చరణ్ అనేది టాలీవుడ్ టాక్. 

ఇండియన్-2 సినిమాను నిర్మించే అవకాశాన్ని దిల్ రాజు వదిలేసుకున్న తర్వాత లైకా ప్రొడక్షన్స్ ఆ చిత్రాన్ని చేజిక్కించుకుంది. ఐతే తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న Kamal Haasan.. ప్రస్తుతం తన మక్కల్ నీధి మయ్యం పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు. దీంతో గతేడాది చివరి నుంచి భారతీయుడు-2 చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. 

Indian-2 చిత్రం షూటింగ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టిన నేపథ్యంలో ఆలోగా మరో సినిమాను పట్టాలెక్కించేందుకు శంకర్ రెడీ అవుతున్నాడని తెలుసుకున్న దిల్ రాజు హుటాహుటిన చెన్నైకి వెళ్లి శంకర్‌తో భేటీ అయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ దిల్ రాజుతో సినిమా తెరకెక్కించేందుకు శంకర్ అంగీకరిస్తే.. అందులో హీరో రామ్ చరణ్ అయితే.. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇక పండగ కాక మరేమవుతుంది. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే అది ఓ యజ్ఞమే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 

Also read : Salaar తర్వాత NTR తో ప్రశాంత్ నీల్ సినిమా !

ఇప్పటికే చెర్రీ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR movie Shooting క్లైమాక్స్ స్టేజ్‌లో ఉంది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో Ram Charan ఓ సినిమా చేయాల్సి ఉంది. ఒకవేళ Director Shankar తో సినిమా ఓకే అయితే.. గౌతంతో చెర్రీ చేయాల్సి ఉన్న సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ త్వరలోనే Dil Raju నుంచి ఒక గుడ్ న్యూస్ విననున్నారన్న మాట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News