Shaakuntalam First Look: శాకుంతలం మూవీ ఫస్ట్ లుక్.. అందాల దేవకన్యగా సమంత!
Shaakuntalam First Look: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో.. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం `శాకుంతలం`. మహాభారత ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుని ప్రేమ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. చిత్రంలోని సమంత ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.
Shaakuntalam First Look: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కావ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌మోహన్ వెండితెరపై కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం స్టార్ట్ చేసింది. ఈ సినిమాలోని సమంత ఫస్ట్ లుక్ ను సోమవారం (ఫిబ్రవరి 21) మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలో దుర్వాస మహర్షి పాత్రలో సీనియర్ నటులు మోహన్ బాబు నటించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 'శాకుంతలం' చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణ నీలిమ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Also Read: Bheemla Nayak Trailer: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ ట్రైలర్ అప్డేట్!
Also Read: Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook