Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!

Samantha enjoys with her Best Friend in Kerala: స్టార్ హీరోయిన్ సమంత కేరళలోని అల్లెపీలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి తన బెస్ట్‌ఫ్రెండ్‌తో సరదాగా గడిపారు. సూర్యాస్తమం సమయంలో ఇద్దరు బీచ్ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 10:42 PM IST
  • సమంత కేరళ వెకేషన్‌
  • నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను
  • ఫోటో షేర్ చేసిన సమంత
Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!

Samantha Ruth Prabhu about her Best Friend: టాలీవుడ్ యువ హీరో నాగ చైతైన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తన్నారు. ప్రస్తుతం సామ్ వెకేషన్స్, షూటింగ్స్ అంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. 

ప్రస్తుతం సమంత వెకేషన్‌లో ఉన్నారు. తాజాగా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లినా సామ్.. అక్కడి అందమైన లొకేషన్స్‌ను ఆస్వాదించించారు. రెడ్‌ కలర్ స్విమ్మింగ్‌ డ్రెస్‌లో జారిపడుతున్న జలపాతం దగ్గర ఎంజాయ్ చేశారు. అక్కడ ఓ బండరాయిపై కూర్చొని, నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు సామ్ చెప్పిన మోటివేషనల్ కోట్స్‌ కూడా ఆలోజింపజేసేలా ఉన్నాయి. 

ఈ రోజు సమంత కేరళలోని అల్లెపీలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లారు. తన బెస్ట్‌ఫ్రెండ్‌తో సరదాగా గడిపారు. సూర్యాస్తమం సమయంలో ఇద్దరు బీచ్ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఇందుకు సంబందించిన పోటోలను సామ్ కొద్దిసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'నువ్వు లేని ఈ జీవితాన్ని అస్సలు ఊహించుకోలేను' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ ఫొటోలకు బెస్ట్‌ఫ్రెండ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. బీచ్ ఒడ్డున సామ్ దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

డైరెక్టర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న 'శాకుంత‌లం' సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి 'కాతువాకుల రెండు కాధ‌ల్' అనే సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుద‌ల‌ కానున్నాయి. హరి- హరీశ్ దర్శక ద్వయంలో తెరకెక్కుతున్న 'య‌శోద' సినిమాలో స‌మంత లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. 

Also Read: Allu Arjun Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక..

Also Read: Saha journalist: ఇదేనా జర్నలిజం అంటే.. చెంచాగిరి చేయడం ఆపండి! ఫైర్ అవుతున్న హర్భజన్, సెహ్వాగ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News