Shah Rukh Khan - Alia Bhatt : అలియాను ఎందుకు అలా పిలుస్తారు?.. షారుఖ్‌ను ప్రశ్నించిన నెటిజన్.. హీరోయిన్ రిప్లై వైరల్
Shah Rukh Khan Pathaan కింగ్ ఖాన్ షారుఖ్ తాజాగా ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఆస్క్ ఎస్ఆర్కే పేరిట చాటింగ్ మొదలుపెట్టేశాడు. అయితే నెటిజన్లకు, తన అభిమానులకు షారుఖ్ ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి.
Shah Rukh Khan Alia Bhatt బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ జనవరిలో పఠాన్ అనే సినిమాతో సందడి చేయబోతోన్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ షారుఖ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తెగ సందడి చేస్తున్నాడు. #ASKSRK పేరిట అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో చిట్ చాట్ చేశాడు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అలియా భట్‌కు సంబంధించిన ప్రశ్న వేశాడు. మామూలుగానే అలియా భట్‌ను ఎస్ఆర్ అని పిలుస్తుంటాడు షారుఖ్. అలా ఎందుకు పిలుస్తారంటూ ఓ నెటిజన్ అడిగితే.. షారుఖ్ ఇచ్చిన వివరణ మీద అలియా భట్ కౌంటర్లు వేసింది. అలా అలియా భట్, షారుఖ్‌ల చర్చ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అలియాను ఎస్ ఆర్ అని ఎందుకు పిలుస్తారు? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి షారుఖ్ ఖాన్ ఇలా సమాధానం ఇచ్చాడు.. ఎస్ ఆర్ అంటే స్వీట్ అండ్ రొమాంటిక్ కావొచ్చు.. సీనియర్ అండ్ రెస్పెక్ట్ కావొచ్చు.. లేద షా రుఖ్ కావొచ్చు అని చెప్పుకొచ్చాడు షారుఖ్ ఖాన్.
షారుఖ్ ఇచ్చిన రిప్లై మీద అలియా భట్ స్పందించింది. అయితే స్వీట్ అండ్ రెస్పెక్టెడ్ కరెక్ట్.. ఇక నిన్ను జనవరి 25 నుంచి పఠాన్ అని పిలుస్తాను.. చూడు నేను ఎంతో క్రియేటివ్ ఉన్న పర్సన్నో.. అని అలియా రిప్లై ఇచ్చింది. దీనికి షారుఖ్ ఇలా స్పందించాడు... ఓకే చిన్నదాన.. ఇప్పటి నుంచి నిన్ను అమ్మ భట్ కపూర్ అని పిలుస్తాను అంటూ కౌంటర్ వేశాడు.
Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట
Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి