Shah Rukh Khan, Katrina Kaif test postive for Covid-19: సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం మళ్లీ మెుదలైంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif)కు కూడా కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  దీంతో షారుఖ్, కత్రినా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవలె బీటౌన్ సూపర్ స్టార్ అక్షయ్ కుమారు కొవిడ్ నుంచి కోలుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ లో ఇలా అందరికీ కరోనా పాజిటివ్ రావడానికి కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీనే కారణమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరణ్​ ఇల్లు కొవిడ్​ హాట్​స్పాట్​గా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ముంబైలోని కె-వెస్ట్ వార్డులో ఉన్న ఫిల్మ్  స్టూడియోలలో పార్టీలు నిర్వహించవద్దని BMC ఆదేశించింది. ఏదైనా పార్టీలు హోస్ట్ చేయబడినట్లయితే, పార్టీలో పాల్గొన్న వారందరి వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 


కింగ్ ఖాన్ షారుఖ్ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ 'జవాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా నుంచి షారుఖ్ లుక్ రిలీజ్ అయింది. మరోవైపు 'పఠాన్' (Pathaan) చిత్రాన్ని 2023 జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. మరోవైపు రాజ్ కుమార్ హిరానీతో కలిసి 'డుంకీ' ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్ తో పాటు 'టైగర్ 3'లో నటిస్తుంది. 


Also Read: IIFA 2022 Awards: ఘనంగా 'ఐఫా 2022' అవార్డుల ప్రదానోత్సవం..ఉత్తమ నటుడిగా విక్కీ, ఉత్తమ నటిగా కృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook