Pathaan Trailer Leaks : పఠాన్ ట్రైలర్ లీక్.. షారుఖ్ ఖాన్‌కు షాక్
Pathaan Trailer Leaks పఠాన్ సినిమా ట్రైలర్ ఇప్పుడు నెట్టింట్లో లీకైంది. పఠాన్ విజువల్స్, స్టంట్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
Pathaan Trailer Leaks షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కోసం బాలీవుడ్ ఎదురుచూస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌ను షారుఖ్ అయినా కాపాడుతాడా? అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలే షారుఖ్ ఫాం కోల్పోయి ఎన్నో ఏళ్లు అవుతోంది. జీరో సినిమాతో నిజంగానే జీరో అయిపోయాడు షారుఖ్. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత పఠాన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది.
షారుఖ్ దీపిక కాంబోలో తెరకెక్కిన పఠాన్ సినిమాను జనవరి 25 విడుదల చేయబోతోన్నారు. విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకుంది. కాషాయం రంగు బికినీ ధరించడం, బేషరం రంగ్ అంటూ పాట పాడటంతో ఈ వివాదం మరింత ఎక్కువగా మారింది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను జనవరి 10, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.
అయితే మేకర్లకు మాత్రం ఇప్పుడు షాక్ తగిలినట్టు అయింది. పఠాన్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందట. విజువల్స్ అదిరిపోయాయ్ అని అంటున్నారు. ఫైటింగ్ సీన్స్ కుమ్మేశాయ్ అని చెబుతున్నారు. పఠాన్ ట్రైలర్ ఇలా బయటకు లీక్ అవ్వడంతో టీం తలపట్టుకుందని తెలుస్తోంది.
మరి ఇప్పుడు పఠాన్ టీం ఏం చేస్తుందో చూడాలి. ట్రైలర్‌ను ముందుగానే రిలీజ్ చేస్తారా? లేదంటే చెప్పిన టైంకే రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. ఇప్పుడు అయితే పఠాన్ ట్రైలర్‌లోని విజువల్స్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోన్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు పఠాన్ ట్రైలర్ మీద చర్చలు నడుస్తున్నాయి.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి