Ram Charan: టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. రచ్చకెక్కిన షారుక్ వ్యాఖ్యలు..
Ram Charan at Anant Ambani: అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఈవెంట్ కు సంబంధించిన పలు రకాల చిత్రాలు వైరల్ అవడంతో అందరూ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను స్టేజ్ మీదకు నాటు నాటు సాంగ్ కు డాన్స్ చేయడానికి ఆహ్వానించిన షారుక్ అతని పిలిచిన విధానం వివాదాస్పదంగా మారింది.
Ram Charan - Shah Rukh Khan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంబానీ ఫ్యామిలీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు గురించే చర్చలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు తరలిరావడంతో ఈ వేడుకకు ఎక్కడలేని పాపులారిటీ సంతరించుకుంది. ఈ వేడుకలకు భార్యతో కలిసి వెళ్లిన రామ్ చరణ్ ను షారుఖ్ అవమానపరిచాడు అంటూ సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ జరుగుతుంది. అతను రామ్ చరణ్ ని పిలిచిన తీరు చాలా మందికి నచ్చడం లేదు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో షారూఖ్ ఖాన్ కు విపరీతమైన క్రేజ్ ,ఫాలోయింగ్ ఉన్నాయి. షారూక్ చిత్రాలను అభిమానించేవాళ్లు మన టాలీవుడ్ లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సినిమాలలోనే కాకుండా తోటి నటులతో కూడా షారుక్ ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు అన్న టాక్ ఉంది. అయితే అటువంటి స్టార్
అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మాట్లాడిన విధానం చాలా మందికి నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా చెర్రీ అభిమానులు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ఖాన్ త్రయం..షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ ఒకే స్టేజీపై స్టెప్పులు వేశారు. వీళ్ళు పర్ఫార్మ్ చేసిన పాటలను ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన నాటు నాటు పాట కూడా ఒకటి. ఈ డాన్స్ పర్ఫామెన్స్ సమయంలో రామ్ చరణ్ ని షారుక్ అనుకోకుండా స్టేజి పైకి డాన్స్ చేయడానికి ఆహ్వానిచారు. అతను పిలిచిన ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ..‘ఇడ్లీ, వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ నువ్వు?’ అంటూ అన్నడం బాగాలేదు అని..ఆది విన్న తర్వాత చాలా అవమానంగా అనిపించి అక్కడ నుంచి వచ్చేసినట్లు..జీబా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
జీబా గత కొద్ది కాలంగా రామ్ చరణ్ కు మేకప్ ఆర్టిస్ట్ గా ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో తన బాధను పోస్ట్ రూపంలో వ్యక్తీకరించింది. మామూలుగానే నార్త్ హీరోలకు.. సౌత్ హీరోలు అంటే కాస్త చిన్న చూపే అని కూడా జీబా అన్నారు. తను షారుఖ్ కు గొప్ప అభిమానిని అని పేర్కొన్న జీబా..రామ్ చరణ్ ను అతను అవమానించిన విధానం తనకు నచ్చలేదని తన ఇన్స్తా పోస్ట్ ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె పోస్ట్ పై స్పందించిన చెర్రీ అభిమానులు.. షారుక్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఆశించలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయం పై షారుక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook