Shah Rukh Khan Pathaan Advance Bookings బాలీవుడ్‌ ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షారుఖ్‌ ఖాన్ తన పఠాన్ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌ను గాడిన పెడతాడని అంతా నమ్మకంగా ఉన్నారు. అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘోరాతి ఘోరంగా బోల్తా పడ్డారు. డిజాస్టర్ల మీద డిజాస్టర్లను ఇచ్చారు. దీంతో బాలీవుడ్ ఇక కోలుకోలేదని అంతా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీయఫ్ వంటి సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను రఫ్పాడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ జనాలు అంతా కూడా సౌత్‌ను చూసి భయపడ్డారు. మళ్లీ బాలీవుడ్‌ తన స్థానాన్ని తాను ఎప్పుడు కైవసం చేసుకుంటుందని అక్కడి జనాలు అనుకున్నారు. అయితే వారికి షారుఖ్ ఖాన్ పఠాన్ రూపంలో ఆశలు చిగురించాయి. పాటలతో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. బ్యాన్ అంటూ జనాలు ట్రెండ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి.


జనవరి 25న రాబోతోన్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్ఆనయి. లక్షల టికెట్లు అమ్ముడుపోతోన్నాయి. ఇక మొదటి రోజును భారీ టార్గెట్‌ను కొట్టేలా కనిపిస్తోంది. దాదాపు వంద కోట్ల గ్రాస్ రాబట్టేట్టు కనిపిస్తోంది. ఒక వేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా మొదటి వీకెండ్‌లోనే మూడు వందల కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.


పఠాన్ సినిమాకు మొదటి రోజు మాత్రం ఇంచు మించు దాదాపు నలభై నుంచి యాభై కోట్ల షేర్ మాత్రం వచ్చేలా ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ సినిమా నిజంగానే బాలీవుడ్‌కు ఊపిరిపోస్తుందా? షారుఖ్‌ ఖాన్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా మారుతుందా? అన్నది చూడాలి.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook