Jawan Movie Review: షారుక్ `జవాన్` సినిమా హిట్టా? ఫట్టా?
Jawan Review : బాలీవుడ్ బాద్షా షారుక్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన జవాన్ ఇవాళ ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. షారుఖ్ మూవీ ఎలా ఉందంటే?
Jawan Movie Review in Telugu: యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన షారుఖ్ ఖాన్ జవాన్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను సోషల్ వీడియో వేదికగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. చాలా మంది ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు. జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ అని కొందరు అంటుంటే. బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని మరొకరు రాసుకొచ్చారు.
మాస్ పాన్ ఇండియా ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ అందించారని ఓ నెటిజన్ దర్శకుడికి కితాబు ఇచ్చారు. కింగ్ సైజడ్ ఎంటర్ టైనర్ ను అందించారని మరొకరు పేర్కొన్నారు. ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు జవాన్ లో పుష్కలంగా ఉన్నాయని మరో నెటిజన్ తెలిపారు. మెుత్తానికి షారుఖ్ జవాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించేలా కనిపిస్తోంది.
అట్లీ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో షారుఖ్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ మూవీపై వీర లెవల్లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కు ముందే రూ. 50 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ తోపాటు సినీ ప్రముఖులు సైతం ఆసక్తిగా ఉన్నారు.
Also Read: Jailer In OTT: ఓటీటీలోకి వచ్చేసిన రజినీకాంత్ 'జైలర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి