Jailer In OTT: ఓటీటీలోకి వచ్చేసిన రజినీకాంత్ 'జైలర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jailer Movie: రజినీకాంత్ 'జైలర్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తలైవా ఈజ్ బ్యాక్ అంటూ రజినీ అభిమానులు చేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ రానుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 12:15 PM IST
Jailer In OTT: ఓటీటీలోకి వచ్చేసిన రజినీకాంత్ 'జైలర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jailer out on OTT: సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'జైలర్'(Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న రిలీజై ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లల్లో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం రూ. 620కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్ల రాబట్టింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.100కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉంచారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

'జైలర్' బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ వచ్చిన లాభాల్లో కొంత మెుత్తాన్ని మూవీ యూనిట్ సభ్యులకు, సామాజిక కార్యక్రమాలకు వినియోగించారు. హీరో రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు కాస్ట్ లీ కార్లను బహుమతిగా ఇచ్చారు. సూపర్ స్టార్ రజినీకి రూ.100 కోట్ల చెక్ ను ఇచ్చారు మారన్.  ఈ మూవీలో రిటైర్డ్ జైలర్ పాత్రలో కనిపించి..తన స్టైల్, యాక్షన్ తో మెప్పించారు రజినీ. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియో రోల్స్ చేశారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు, సునీల్ ఇతరపాత్రల్లో నటించారు. థియేటర్లలో సంచనాలు సృష్టించిన ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. 

Also Read: Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News