Jawan Collection Day 6: రూ. 600 కోట్లకు చేరువలో `జవాన్`.. ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే?
Jawan Movie: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తోంది. ఐదో రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. ఆరో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే...
Jawan Box Office Collection Day 6: బాక్సాఫీస్ పై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దండయాత్ర కొనసాగుతుంది. అతడి దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. 'జవాన్' సినిమా విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఆరో రోజు కూడా జవాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆరో రోజు ఈ మూవీ అన్ని భాషలకు కలిపి రూ. 28.50 కోట్లు కలెక్ట్ చేసింది.
తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత కూడా అదే రోజు కొనసాగిస్తుంది. మెుదటి రోజు రూ.75 కోట్లు, రెండో రోజు రూ.53.23 కోట్లు, మూడో రోజు రూ.77.83 కోట్లు, నాలుగో రోజు రూ.80.1 కోట్లు, ఐదో రోజు రూ. 32.92 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ క్రమంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.574.89 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఆరు వందల కోట్ల వైపు దూసుకెళ్తోంది.
రిలీజైన మెుదటి రోజు నుంచే 'జవాన్' (Jawan Movie)కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుఖ్ యాక్షన్ కు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. విజయ్ సేతుపతి మరోసారి విలన్ గా రాణించాడు. ఈ మూవీలో షారుఖ్ జోడిగా నయనతార నటించింది. ఇందులో ప్రియమణి, బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ కనిపించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు.
Also Read: Anushka Shetty Video: వారి కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రత్యేక షో.. ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook