Shakuntala Character Portrayed సమంత శాకుంతలం సినిమా రేపు (ఏప్రిల్ 14) థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ను దిల్ రాజు పక్కాగా అమలు చేశాడు. అయితే చివర్లో మాత్రం సమంత హ్యాండ్ ఇచ్చినట్టు అయింది. సమంతకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇప్పుడు ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం సమంత తన శాకుంతలం సినిమాను బాగానే ప్రమోట్ చేస్తోంది. అయితే సమంత తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో శకుంతల పాత్రను ఇది వరకు పోషించిన తారల గురించి చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శకుంతల పాత్రల గతంలో వీరంతా నటించారంటూ సమంత చెప్పుకొచ్చింది. డొరొతి, కేఆర్ విజయ, ఎంఎస్ సుబ్బలక్ష్మీ, బి సరోజదేవి, జయశ్రీ, అనిత, జయప్రద, సంధ్య, కమలభాయ్ వంటి వారు శకుంతల పాత్రను పోషించారు. ఈ మేరకు  సమంత వేసిన పోస్ట్‌ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సమంత కంటే ముందు ఇంత మంది ఈ పా్రతను పోషించారా? అని జనాలు ఆశ్చర్యపోతోన్నారు.


 



ఇందులో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద పేరున్న తారలు ఆ పాత్రను పోషించారు. అయితే ఇప్పుడు ఈ లక్కీ చాన్స్ సమంతకు వచ్చింది. మరి సమంతను శకుంతలగా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమా మెప్పిస్తుందా? లేదా? అన్నది చూడాలి. అసలే గుణ శేఖర్ మేకింగ్ అందరికీ మంచి అంచనాలే ఉంటాయి. కానీ టీజర్, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్ జనాలను మెప్పించలేకపోయింది.


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


ఇక ఈ సినిమాను ఇప్పుడు త్రీడీ ఫార్మాట్‌లోనూ మార్చిన విషయం తెలిసిందే. త్రీడీలో మార్చడం వల్ల ఎఫెక్ట్ వస్తుందని, బజ్ పెరుగుతుందని చిత్రయూనిట్ భావించినట్టుంది. కానీ సినిమా మీద ఎలాంటి హైప్ ఏర్పడలేదు. ఆల్రెడీ ముందుగా వేసిన ప్రీమియర్ షోలు దెబ్బ కొట్టేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. మరి పూర్తి రివ్యూ వచ్చాక సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది చూడాలి.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook