shani budh shukra gochar : శని బుధ శుక్ర గోచారం 2022 : ఈ రాశుల వారికి శుభాలు.. అపర కుబేరులవుతారట
shani budh shukra gochar Effect శని బుధ శుక్ర గోచారం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుందట. దీంతో డిసెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మీ తాండవం చేయనుందట.
shani budh shukra gochar Effect : డిసెంబర్ నెలలో గ్రహాల స్థానాలు మారుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ చివరి వారంలో శని, బుధ, శుక్ర గ్రహాలు ఒకే రాశిలోకి వస్తాయి. ఈ మూడు కూడా మకరరాశిలో కలిసిపోతాయి. శని ఇప్పటికే మకరరాశిలో ఉండగా.. డిసెంబర్ 28న బుధ గ్రహం ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది. మరుసటి రోజు డిసెంబర్ 29న శుక్రుడు ధనుస్సు నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.
డిసెంబరు నెలాఖరులో బుధుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక చాలా ముఖ్యం. దాని వల్లు మొత్తం అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు సంభవించనున్నాయి. అయితే ఈ నాలుగు రాశుల వారికి చాలా శుభప్రదంగా , సంపన్నంగా ఉండబోతోంది.
డిసెంబర్‌లో బుధుడు-శుక్రుడు, శని గ్రహాల కలయిక మేషరాశి వారికి విపరీతమైన ప్రయోజనాలను ఇస్తుంది. కెరీర్‌లో వేగంగా పురోగతి ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. అనుకోని లాభాలు వచ్చి పడతాయి.
మకరరాశిలో బుధ, శుక్ర, శని కలిసిన వెంటనే కన్యారాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీతం పెరుగుతుంది. పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
శని, బుధ, శుక్రులు కర్కాటక రాశి వారికి బలమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కొత్త ఆస్థి, కారు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త మార్గాల్లో ధనార్జన ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తులు దొరుకుతాయి. పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి.
మీనరాశి వారికి శని-బుధ-శుక్రులు గొప్ప విజయాన్ని అందిస్తారు. కొత్త ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Raviteja As Vikram Sagar ACP : మాస్ లుక్, తెలంగాణ యాస.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా రవితేజ
Also Read : Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook