Bharateeyudu 2 Review: కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో.. త్వరలో విడుదల కాబోతున్న సినిమా భారతీయుడు 2. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం భారతీయుడు 2.. జులై 12న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. కమల్ హాసన్, సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సిద్ధార్థ, రకుల్ ప్రీత్ లతోపాటు డైరెక్టర్ శంకర్ కూడా పలు ఇంటర్వ్యూలలో.. పాల్గొంటూ.. సినిమా సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైం.. గురించి మాట్లాడుతూ భారతీయుడు 2 సినిమాలో అసలు కట్ చేయడానికి ఏదీ లేదు అని ప్రతి సీన్ సినిమాకి చాలా కీలకం అన్నట్టు మాట్లాడారు.  కాగా ఈ సినిమా రన్ టైం మూడు గంటల పైన కావడంతో.. అంతేకాకుండా ఈ సినిమాకి మూడో భాగం కూడా ఉండడంతో.. ప్రేక్షకులు ఇది ఈ చిత్రానికి మైనస్ కావచ్చు ఏమో ఏమో అని గత కొద్ది రోజుల నుంచి.‌. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే ప్రశ్న శంకర్ కి ఎదురు కాగా.. తాను మాత్రం ఆ విషయం గురించి ఏం చేయలేను అని కరాకండిగా చెప్పాడు.


"మనం జుట్టు కట్ చేయచ్చు, గోర్లు కట్ చేయచ్చు కానీ చేతి వెళ్ళు కట్ చేసుకోలేం కదా. అలాగే ఇండియన్ 2 లో కట్ చేయడానికి ఏమీ లేదు. అందుకే ఇండియన్ 3 కూడా చేశాం" అని శంకర్ అన్న మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. 


కంపారిజన్ ఏమాత్రం బాగోకపోయినా.. శంకర్ కి సినిమా మీద ఉన్న నమ్మకం చూసి ఫ్యాన్స్ కి ముచ్చటేసింది. నిజానికి భారతీయుడు 2 కోసం శంకర్ చాలా పెద్ద కథ ని అనుకున్నారట. దీంతో సినిమా 4 గంటల కంటే ఎక్కువ అయిపోతుంది అని.. సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 


ఆల్రెడీ ఉన్న కథనే కట్ చేసి శంకర్ రెండు భాగాలుగా సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2.. లో ఇంకా కట్ చేయడానికి ఏమీ లేదు అని ప్రతి సీన్ సినిమాకి చాలా కీలకమని ఇన్ డైరెక్ట్ గా ఇలా చెప్పారు శంకర్. ఏమైనా భారతీయుడు 2 సినిమా మీద మాత్రం శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థం అవుతుంది. మరి ఆ కాన్ఫిడెన్స్ సినిమా విషయంలో.. ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.


Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..


Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి