RC 15 Song Shoot Budget : కాంతారా సినిమాను కేవలం పది హేను కోట్ల తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఈచిత్రం మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్లను కొల్లగొట్టేసింది. శంకర్ లాంటి దర్శకుడు తన సినిమాను ఎంత రిచ్‌గా తీస్తాడో అందరికీ తెలిసిందే. శంకర్ కేవలం తన సినిమాలో పాటలకే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు. ఒక్కో పాటను ఒక్కో థీమ్‌తో సెట్ చేస్తాడు. శంకర్ పాటల మీద అంతగా దృష్టి పెడుతుంటాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ శంకర్ శైలిలో పాటలుండబోతోన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది వరకు ఫారిన్ డ్యాన్సర్లతో ఓ సాంగ్‌ను భారీ ఎత్తున షూట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పాటను షూట్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయిందట. ఈ పాట బడ్జెట్ అక్షరాలా పదిహేను కోట్లు అని తెలుస్తోంది. విదేశాల్లో షూట్ చేయబోతోన్న ఈ సాంగ్ షూటింగ్‌కు దాదాపు 15 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఒక సాంగ్‌ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం బహుశా ఇదే మొదటి సారి అవుతుందేమో.


అసలే శంకర్ ఇప్పుడు ఇండియన్ 2, RC 15 షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. మధ్యలో అయితే RC 15 సినిమాను పక్కన పెట్టేశారని, శంకర్ దృష్టి అంతా కూడా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా మీదే ఫోకస్ పెట్టాడని టాక్ వచ్చింది. కానీ నెలలో పదిహేను రోజులు అక్కడ, పదిహేను రోజులు ఇక్కడ అన్నట్టుగా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నానని శంకర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


మరి డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సాంగ్ షూట్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారట. కియారా అద్వాణీ, రామ్ చరణ్‌ల మీద ఈ సాంగ్ ఉండబోతోందని తెలుస్తోంది. శంకర్ ఈ సాంగ్‌ను ఎలా ఊహించాడో.. తమన్ ఎలా కొట్టాడో.. ఎలా పిక్చరైజ్ చేసి ఉంటారో అని అభిమానులు అనుకుంటున్నారు.

Also Read : Sitara Ghattamaneni Emotional Post : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. మిస్ యూ తాతగారు.. కదిలించిన సితార పోస్ట్


Also Read : Bigg Boss Shrihan : రోజురోజుకీ దిగజారుతున్న శ్రీహాన్.. అదిరిపోయేలా ఇచ్చి పడేసిన కీర్తి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook