Sitara Ghattamaneni Emotional Post : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. మిస్ యూ తాతగారు.. కదిలించిన సితార పోస్ట్

Sitara Ghattamaneni Condolence తండ్రిని పొగొట్టుకుని మహేష్‌ బాబు ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన తాత మరణంతో సితారా ఎమోషనల్ అవుతోంది. తాతను గర్వపడేలా చేస్తానంటూ సితార వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 02:18 PM IST
  • సూపర్ స్టార్ కృష్ణ మరణం
  • సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
  • తాత గర్వపడేలా చేస్తానన్న సితార
Sitara Ghattamaneni Emotional Post : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. మిస్ యూ తాతగారు.. కదిలించిన సితార పోస్ట్

Sitara Ghattamaneni Condolence : సితారా ఘట్టమనేని తాజాగా తన తాత కృష్ణ మరణం మీద ఎమోషనల్ అయింది. తన తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇకపై వీకెండ్ లంచ్‌లు ఇంతకు ముందున్నట్టుగా ఉండవు.. మీరు నాకు ఎన్నో విలువలు నేర్పించారు.. నన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉండేవారు.. ఇక ఇవన్నీ నాకు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి.. మీరే నా హీరో.. నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాననే నమ్మకం నాకుంది.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాను తాత గారు అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ వేసింది.

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుఝామున కాంటినెంటెల్ హాస్పిటల్లో కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. అయితే అప్పటికే ఆయనకు గుండెపోటు రావడం, స్పృహలేని స్థితిలోనే ఆస్పత్రికి తీసుకొచ్చారంటూ వైద్యులు తెలిపారు. ఇక సోమవారం అంతా కూడా కృష్ణకు క్రిటికల్ కండీషన్‌లోనే చికిత్స అందించారు. కానీ చివరకు మంగళవారం ఉదయం నాడు కృష్ణ తుది శ్వాసవిడిచారు.

నేడు కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆయన అంతిమ యాత్రం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఘట్టమనేని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా సితారా వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకంటోంది. ఇక కృష్ణ కూతురు మంజుల సైతం తన తండ్రి మీదున్న ప్రేమను కురిపించింది. 

డియర్ నాన్నా.. మా ప్రపంచానికి మీరే సూపర్ స్టార్.. అయితే ఇంట్లో మాత్రం మాతో ఎప్పుడూ ఓ సాధారణ వ్యక్తిలానే ఉన్నారు.. మాకోసం ఎప్పుడూ నిలబడ్డారు.. ఎంత బిజీగా ఉన్నా కూడా మాకోసం టైం కేటాయించారు.. మాకేం కావాలో చూసుకున్నారు.. ఎలా బతకాలో మాకేం ఉపన్యాసాలు కూడా ఇవ్వలేదు.. మీరు చేసే పనుల ద్వారా మాకు ఎలా ఉండాలో చెప్పకనే చెప్పేశారు. 

మీ సంప్లిసిటీ, హుందాతనం, తెలివి, క్రమశిక్షణ, సమయపాలన ఇలా అన్నీ ఉండటం చాలా అరుదు.. మీరు సినిమా పరిశ్రమకు చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మీరే మా బలం.. మీరే మాకు సర్వస్వం.. మీరే నా హీరో.. మీది సముద్రమంత ప్రేమ. మాకేం కావాలో మాకు తెలియకపోయినా.. మాకేం అవసరమో మీరు గుర్తించి ఇచ్చారు.. మిమ్మల్ని నేను దారుణంగా మిస్ అవుతున్నాను. రాత్రి పూట కూడా మనం ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం.. అది ఇప్పుడు మిస్ అవుతున్నాను.. లంచ్, లంచ్‌లోని చర్చలు ఇవన్నీ మిస్ అవుతాను.. అంటూ ఎమోషనల్ అయింది.
 

Also Read : Bigg Boss Shrihan : రోజురోజుకీ దిగజారుతున్న శ్రీహాన్.. అదిరిపోయేలా ఇచ్చి పడేసిన కీర్తి

Also Read : Super Star Krishna Death : కృష్ణ మరణం.. నాడు నేడు.. మహేష్‌, చైతూ, ఎన్టీఆర్ పిక్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News