Aadavallu Meeku Joharlu Twitter Review: యువ హీరో శర్వానంద్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఫామిలీ డైరెక్టర్ కిశోర్​ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దాంతో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపై భారీ అంచనాలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రీమియర్ షోలు అమెరికాలో పూర్తికాగా.. భారత దేశంలో కూడా స్పెషల్ షోలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ షో పూర్తయింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమాకు నెటిజన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. కొంతమంది బాగుంది అని కామెంట్లు చేస్తే.. మరికొంత మంది మాత్రం యావరేజ్ అని కామెంట్లు చేస్తున్నారు. రొటీన్‌ కథకు కామెడీ, రొమాన్స్‌ జతచేసి చూపించారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 



ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాప్‌ యావరేజ్‌ అని చాలా మంది ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. బెటర్ ఎండింగ్ ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా 'గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌' అని చెప్పొచ్చు. పెళ్లి చేసుకోవాలనుకున్న  ఓ అబ్బాయికి (శర్వా) తన కుటుంబంలోని మహిళల వలన పెళ్లిళ్లు సెట్ కాకపోవడం, తనకు నచ్చిన అమ్మాయికి (రష్మిక) నచ్చకపోవడం, ఆమెను ఒప్పించేందుకు ఆ అబ్బాయి చేసే ప్రయత్నాలను డైరెక్టర్ చూపించాడు. శర్వా నటన, రష్మిక అందం, దేవిశ్రీ సంగీతం సినిమాకు అదనపు బలం. 





ALso Read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!


Also Read:  Rohit Sharma Journalist: పిచ్‌, టీమ్ కాంబినేషన్‌ కంటే మసాల వార్తలే కావాలా.. జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ ఫైర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook