Rohit Sharma Journalist: పిచ్‌, టీమ్ కాంబినేషన్‌ కంటే మసాల వార్తలే కావాలా.. జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ ఫైర్!!

Rohit Sharma trolls Journalist, India vs Sri Lanka 1st Test: మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 09:46 AM IST
  • విరాట్ కోహ్లీకి ఇదో అత్యుత్తమమైన ఘనత
  • టీమ్ కాంబినేషన్‌ కంటే మసాల వార్తలే కావాలా
  • జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ ఫైర్
Rohit Sharma Journalist: పిచ్‌, టీమ్ కాంబినేషన్‌ కంటే మసాల వార్తలే కావాలా.. జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ ఫైర్!!

Rohit Sharma trolls Journalist in IND vs SL 1st Test interview: రెండు టెస్ట్‌ మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకోనున్నాడు. మరోవైపు మొహాలీ టెస్ట్ మ్యాచ్‌ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. కెరీర్‌లో కోహ్లీ ఆడుతున్న 100వ టెస్ట్ మ్యాచ్ ఇది. దాంతో ఈ టెస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడాడు.

మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ ఆడుతున్న నేపథ్యంలో అతనికి ఈ మ్యాచ్‌ను స్పెషల్‌గా మారుస్తున్నామని, అతడికి ఇదో అత్యుత్తమమైన ఘనత అని రోహిత్ అన్నాడు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్.. మీరు మైదానం బయట మ్యాచ్ ఆడుతున్నారా?.. అసలు పిచ్, టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ కాస్త భిన్నంగా స్పందిస్తూ ఫైర్ అయ్యాడు. 

'ఈ మధ్యన ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయడం లేదు. మీరు అడిగినది మంచి ప్రశ్న. అయితే పిచ్‌ గురించి, జట్టు కాంబినేషన్‌ గురించి, ప్రేక్షకుల గురించి ఒక్కరు కూడా అడగడం లేదు. మీరు ఆట కంటే మసాల వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మీరు అడగకపోవడం కూడా ఒక రకంగా మంచిదే. అప్పుడే కదా అన్ని విషయాల నుంచి మేము తప్పించుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు వస్తుండడం నాకు సంతోషం కలిగించింది' అని సదరు జర్నలిస్ట్‌‌పై రోహిత్ శర్మ సెటైర్లు వేశాడు. 

ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ముందుగా ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేయగా.. కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని ఆ తర్వాత డిలీట్ చేసింది. అనంతరం బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక రోహిత్‌ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌కు స్వదేశంలోనూ ఇదే తొలి సిరీస్‌. ప్రస్తుతం రోహిత్ మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్నాడు. 

Also Read: IND vs SL: టీమిండియాదే బ్యాటింగ్.. పుజారా స్థానంలో తెలుగు ఆటగాడికి చోటు! ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్!

Also Read: Gold Rate Today 4 March 2022: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! వెండి ధర మాత్రం..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News