Sheezan Khan Mental Condition Is Not Good Says His Lawyer: తునీషా శర్మ మరణం తర్వాత ఆమె మరణానికి సంబంధించి ప్రతిరోజూ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు షీజన్ ఇంటి భోజనం పెట్టించమని అడుగుతున్నాడనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక నిన్న షీజన్ ఖాన్ ను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లగా ఆ తర్వాత అతని కస్టడీని 14 రోజుల పాటు పొడిగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గత రాత్రి షీజన్ లాయర్ అతనికి రహస్య గర్ల్‌ఫ్రెండ్ లేదని చెప్పాడు,ఆయన అందుకు సమబందించిన పూర్తి వివరాలు ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది. ఇక  తునీషా మేనమామ పవన్ శర్మపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారని షీజన్ తరపు న్యాయవాది ఈరోజు తెలిపారు. తునీషా మేనమామపై షీజన్ లాయర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా పోలీసుల వద్ద ఎలాంటి పక్కా ఆధారాలు లేవని, ఒత్తిడి మేరకే షీజన్ మహమ్మద్ ను అరెస్ట్ చేశారని ఆయన కామెంట్ చేశారు.


అంతే కాకుండా ఎఫ్‌ఐఆర్‌లో అనేక లోపాలను కూడా గుర్తించామని లాయర్ చెబుతున్నారు. మీడియా ఒత్తిడి మేరకే షీజన్‌ని అరెస్ట్ చేసినట్లు షీజన్ తరపు న్యాయవాది తెలిపారు. అంతే కాకుండా తునీషా మేనమామపై కూడా లాయర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తునీషాకు పవన్ శర్మ అసలు మేనమామ కాదని ఆయన అన్నారు, అలాగే తునీషా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని లాయర్ పేర్కొన్నారు.


పవన్ శర్మ మొత్తం విచారణను తప్పుదారి పట్టించాడని షీజన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక షీజన్ మానసిక పరిస్థితి ఏమిటో మీరు, నేను అర్థం చేసుకోలేమని, మూడు రోజుల క్రితం ఆ జైలులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకే షీజన్ కు కౌన్సెలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశామని అన్నారు. అంతేకాక షీజన్‌ను ఒంటరిగా వదిలిపెట్టకూడదని, షీజన్ ఆత్మహత్య వంటి చర్యలు కూడా తీసుకోగల స్థితిలో ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. 


Also Read: Naresh-Pavitra Lokesh: తగ్గేదే లేదు.. మరిన్ని వీడియోలు రిలీజ్ చేసే యోచనలో పవిత్ర-నరేష్!


Also Read: Ghost Motion Poster: వింటేజ్ స్టైల్లో 'ఘోస్ట్'..దుమ్ము రేపుతున్న మోషన్ పోస్టర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook