Shekar Teaser: యాంగ్రీ హీరో రాజశేఖర్ నటిస్తున్న చిత్రం'శేఖర్'(Shekar Movie Teaser). ఈ చిత్రానికి రాజశేఖర్ భార్య జీవిత(Jeevita Rajasekhar) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే..తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్ లోకి వెళితే... ఓ రిపోర్టర్‌ చదివిన నేర వార్తతో టీజర్ ప్రారంభమవుతుంది. ''వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా'' అని డైలాగ్ కథానాయకుడి పాత్ర గురించి చెబుతుంది. రాజశేఖర్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తిరిగి ఓ కేసును సాల్వ్ చెయ్యడానికి వచ్చినట్లు చూపించారు. రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 


Also read: Sampoornesh Babu: 'అమీర్ ఖాన్ తర్వాత ఆ సీన్ నేనే చేశా.. బంధువులు, స్నేహితులు ఆడేసుకున్నారు'


ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. గరుడవేగ, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు రాజశేఖర్(Rajashekar). అప్పటి నుంచి ఆయన సెలెక్టడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ సినిమా 91వ చిత్రం కావడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి