Shilpa Shetty - Anushka Shetty : `కాంతారా`కు శెట్టిల సపోర్ట్.. శిల్పా శెట్టి, అనుష్క శెట్టిల పోస్ట్ వైరల్
Shilpa Shetty And Anushka Shetty అనుష్క శెట్టి, శిల్పా శెట్టి తాజాగా కాంతారా సినిమా మీద పోస్టులు వేశారు. సినిమా అద్భుతమని కొనియాడారు.
Anushka Shetty Supports Kantara Movie : రిషభ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మన్నలను అందుకుంటోంది. కన్నడలో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా డబ్ అయింది. ఆల్రెడీ కన్నడలో వంద కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంతారా గాలి వీస్తోంది. తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ టాక్, కలెక్షన్లతో దూసుకుపోతోంఇ.
ఈ సినిమాకు సెలెబ్రిటీల నుంచి కూడా స్పందన వస్తోంది. అసలే కన్నడలో ఇప్పుడు శెట్టిల హవా కొనసాగుతోంది. చార్లీ అంటూ రక్షిత్ శెట్టి దేశాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రిషభ్ శెట్టి కాంతారాతో అవాక్కయ్యేలా చేశాడు. రాజ్ బీ శెట్టి సినిమాలు సైతం ట్రెండ్ అవుతున్నాయి. అలా ఈ త్రయం శెట్టిల హవా ఇప్పుడు ఉంది. ఈ శెట్టిలకు శిల్పా శెట్టి, అనుష్క శెట్టిలు మద్దతుగా నిలిచారు. రిషభ్ శెట్టి కాంతారా సినిమా మీద శిల్పా శెట్టి, అనుష్కలు పోస్ట్ వేశారు.
'కాంతారా సినిమా కోసం ఈ పోస్ట్ వేస్తున్నాను.. ఆ చిత్రాన్ని పొగిడేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను.. థియేటర్లో ఈ సినిమాను చూశాను.. ఓరీ దేవుడా.. ఏం సినిమా అది.. ఏం చెప్పాడు.. ఏం ఎమోషన్స్.. ఏం అద్భుతం ప్రపంచం.. అన్నీ అదిరిపోయాయ్.. క్లైమాక్స్ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.. సినిమా పవర్ ఇదే.. మనల్నీ వేరే లోకంలోకి తీసుకెళ్లారు.. అది నా ప్రపంచం.. నా రూట్స్ అక్కడే ఉన్నాయ్.. మళ్లీ నా పాత రోజుల్ని గుర్తుకు చేసుకున్నట్టు అయింది.
ఎలాంటి పక్షపాతం లేకుండా చెబుతున్నా.. స్టోరీ చెప్పే విధానం, నటన, కథ మీద నమ్మకం, దర్శకత్వం ఇలా అన్నీ కూడా వో (సినిమాలో రిషభ్ శెట్టి అరిచే తీరు) రిషభ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు, చెప్పిన తీరు, నటించిన విధానం అన్నింటికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఇది ఆయన ఖాతాలో మరో మణిలా చేరుతుంది.. సక్సెస్‌ను ఎంజాయ్ చేయండి' అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది.
'కాంతారా సినిమాను చూశాను.. నాకు విపరీతంగా నచ్చింది..ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. కాంతారా అద్భుతమైన టీం.. మాకు ఈ అనుభూతిని ఇచ్చినందుకు థాంక్స్.. రిషభ్ శెట్టి నువ్వొక అద్భుతానివి.. అందరూ దయచేసి ఈ సినిమాను థియేటర్లోనే చూడండి.. అస్సలు మిస్ అవ్వకండి' అని అనుష్క శెట్టి పోస్ట్ వేసింది.
Also Read : Nandamuri Balakrishna - Unstoppable : అలా ట్రై చేసినవన్నీ పోయాయట.. దటీజ్ బాలయ్య
Also Read : Kantara vs Godfather : కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ గూటికి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook