Shilpa Shetty Leg Injured During Indian Police Force Shooting: భర్త రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితం అయిపోయిన శిల్పా శెట్టి ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.  శిల్పాశెట్టి ప్రస్తుతం తన 'సుఖి' సినిమా అలాగే 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె తన మొదటి వెబ్ సిరీస్‌లో యాక్షన్ పార్ట్ కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ వెబ్ సిరీస్ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె ఉత్సాహం ఇప్పుడు ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, శిల్పా ప్రమాదానికి గురైంది, ఆమె చాలా తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పంచుకుంది. శిల్పాశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేయగా, ఆ ఫోటోలో శిల్పాశెట్టి ఆసుపత్రిలో వీల్ చైర్‌పై కూర్చొని ఉంది, అలాగే ఆమె విరిగిన కాలును చూపుతూ ఒక విక్టరీ సింబల్ ను కూడా చూపిస్తుంది.


గాయపడిన నేపధ్యంలో చాలా బాధ ఉన్నప్పటికీ, ఆమె ముఖంలో అందమైన చిరునవ్వులు రువ్వుతూ కనిపిస్తోంది. ఇక క్యాప్షన్ లో ఆమె ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. శిల్పాశెట్టి క్యాప్షన్‌లో వారు రోల్ యక్షన్ కెమెరా అని చెప్పి కాలు విరగ్గొట్టుకో అన్నారు, నేను దానిని సీరియస్ గా తీసుకున్నాను, అందుకే రాబోయే ఆరు వారాల పాటు వర్క్ నుండి సెలవు తీసుకుంటున్నాను, కానీ నేను త్వరలో ఆరోగ్యంగా, బలంగా తిరిగివాస్తా, అప్పటి వరకు మీద ప్రార్థనలో నన్ను గుర్తుంచుకోండి. ఈ ప్రార్థనలు ఎల్లప్పుడూ పని చేస్తాయని అంటూ ఆమె కామెంట్ చేసింది. 


Also Read: Actress Tabu: షూటింగ్లో ప్రమాదం..తీవ్రంగా గాయపడిన టబు!


Also Read: Laal Singh Chaddha: నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.