Shilpa Shetty Diet Plan: శిల్పాశెట్టి.. పేరుకు తగినట్లుగా పాలరాతి శిల్పంలా అందంగా ఉంటుంది ఈ బ్యూటీ. 48 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇక శిల్పా ఫిట్నెస్ విషయానికి వస్తే.. ఎక్ససైజ్, యోగా అంటూ ఎప్పుడు యమ యాక్టివ్ గా ఉంటుంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు శిల్పా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. మరి ఆమె తీసుకుని ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శిల్పా శెట్టి ఫిట్నెస్ కు ముఖ్య కారణం ఆమె వ్యాయామం. జిమ్ లో వర్క్ అవుట్ చేయడమే కాక శిల్పా యోగా కూడా బాగా చేస్తుంది. యోగ మన శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతోపాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది అని శిల్పా భావిస్తుంది. ఆమె అందాల రహస్యానికి మరొక కారణం వేడి నీళ్లు. రోజు పొద్దున నిద్రలేచిన తర్వాత కాళీ కడుపుతో ఆమె కోరు వెచ్చటి నీటిని కచ్చితంగా తాగుతుందట.


కాళీ కడుపుతో గోరువెచ్చటి నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు సులభంగా తొలగిపోయి జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి అలవాటు. ఇకాల్పాహారం కింద రోజు శిల్పా ఉదయం బొప్పాయి పండు తింటుందట. అలాగే పాలు ,ఉడికించిన గుడ్లు తీసుకుంటుంది. లంచ్ విషయానికి వస్తే శిల్ప ఖచ్చితంగా భోజనంలో చాపలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటారు. చాపలు ఒమేగా త్రీ కలిగి ఉండడంతో చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచుతాయి. వీటిలో పాటు అన్నం , రెండు రోటీలు, ఒక కప్ పప్పు కూడా తీసుకుంటుందట.


మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత జీర్ణవ్యవస్థ మెరుగ ఉండడం కోసం ఓ చిన్ని బెల్లం ముక్కను కచ్చితంగా శిల్పా తీసుకుంటుంది. సాయంత్రం వేళ ఆకలి అనిపిస్తే ఒక గ్లాస్ మజ్జిగ తప్ప ఇంకేమీ తీసుకోదట. డిన్నర్ విషయానికి వస్తే మంచి సీజనల్ వెజిటేబుల్ సలాడ్, సూప్ శిల్పా ఫేవరెట్. రాత్రి వీలైనంతవరకు సాలిడ్స్ ఏమి తీసుకోకుండా ఉంటుదట. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది అని శిల్పా భావిస్తుంది. వీలైనంత వ్యాయామం చేయడం.. మితంగా ఆహారం తీసుకోవడం.. స్ట్రెస్ కు వీలైనంత దూరంగా ఉండడం.. ఇవే శిల్పా శెట్టి బ్యూటీ సీక్రెట్స్. శిల్పా అందానికి కారణం తెలుసుకున్నారుగా.. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ డైట్ లో వీటిని భాగంగా మార్చుకోండి.


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook