Bhoothaddam Bhaskar Narayana Response:
శివ కందుకూరి హీరోగా స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన క్రైమ్ త్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి ఒకటిన్న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ  నేపధ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సక్సెస్ మీట్ లో ముందుగా ఈ చిత్ర హీరో శివ కందుకూరి మాట్లాడుతూ... “ఈ చిత్రం స్టార్ట్ చేసినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికిమించి ఒక మంచి విజయం వస్తే చాలు అని నా మనసులో ఉండేది. మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్ ఈ సినిమాతో మేము సాధించగలగడం.. నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా వుంది. మాకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ చాలా థాంక్స్. సినిమాకి మంచి రివ్యూస్ వస్తున్నాయి అలానే చూసిన ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. మా చిత్రం నిర్మాతలు స్నేహాల్, శశిధర్, కార్తీక్ చాలా సహాయం చేశారు. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్ కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్. శ్రీచరణ్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది. సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాకు ఈ విషయం తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడింది. ప్రిమియర్స్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. చూడని వారు ఈ సినిమా తప్పకుండా చూడండి. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది. గొప్పగా అలరిస్తుంది'' అని చెప్పుకొచ్చారు.  


ఆ తరువాత ఈ సినిమా హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ..  “ మాకు ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి ఆనందంగా వుంది. హౌస్ ఫుల్ బోర్డ్ చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. నాకు ఇంత మంచి పాత్ర అందించినందుకు థాంక్స్. రాజ్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయన సపోర్ట్ కి ధన్యవాదాలు. శివ చాలా కొత్త క్యారెక్టర్ చేశారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చారు. 


చివరిగా హీరో శివ కందుకూరి తండ్రి రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “ప్రిమియర్స్ షోస్ అన్నిటికి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన తర్వాత మేము ఊహించిన దానికంటే గొప్ప విజయం సాధించింది. ఇంత మంచి విజయం ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాతో శివ కొరుకునే గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర కోసం తనని తాను మలచుకున్నాడు. ఈ సినిమాకి ఇంత విజయం అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter