Kannappa Movie Updates: డైనమిక్ స్టార్ విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకూ స్థాయిని పెంచుకుంటూ పోతోంది. కన్నప్ప నుంచి వస్తోన్న అప్డేట్లతో పాన్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. కన్నప్ప చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చారు. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. అంతకంటే ముందే ఈ వార్తలపై మంచు విష్ణు స్పందిస్తూ.. హరహర మహదేవ్ అంటూ ట్వీట్ వేశారు. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ కన్నప్పలో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే ఉంది.


బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.


Also Read: Mahesh Babu: కండలు పెంచే పనిలో మహేశ్.. వైరల్ అవుతున్న న్యూ లుక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook