Fans Throws Slipper on Kannada Star Darshan Face కన్నడ స్టార్ దర్శన్‌కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి ఫాంలో ఉన్నాడు. డీ బాస్ దర్శన్ అంటూ అక్కడ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. అయితే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ కాంట్రవర్సీగానే ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ మీద గతంలో దర్శన్ ఏవో వ్యాఖ్యలు చేశాడట. దీంతో ఇప్పుడు అప్పు అభిమానులు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దర్శన్ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు. తన అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ చెప్పుని విసిరాడు ఆకతాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దర్శన్ మాత్రం వదిలేయండి, చిన్నదే కదా? అని అన్నట్టుగా కనిపిస్తోంది. దర్శన్ మీద ఇలా చెప్పు విసరడం మీద జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.


 



కర్మ ఇలానే ఉంటుంది.. మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఇలాంటి ఘటనలను తప్పు పడుతున్నారు. మన ఇంటి ఫ్యామిలీ మెంబర్ల మీద ఇలా చేస్తే మనకు కోపం రాదా? అని నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ఓ వీడియోను వదిలాడు.


 



'నిన్న హోస్పేట్‌లో దర్శన్‌పై చేసిన చర్య నా హృదయాన్ని బాధించింది. ఇలాంటి అమానవీయ ఘటన ఒకే కుటుంబానికి చెందిన వారందరినీ బాధిస్తోంది. ఎవరూ మానవత్వాన్ని మరచి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి చేస్తున్నాను అభిమానంతో ప్రేమను చూపించు.. ద్వేషం అగౌరవం కాదు మీ శివన్న' అంటూ ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ వేశాడు.


Also Read : Dhamaka First Review : ధమాకా రివ్యూ.. శ్రీ లీలను చూస్తే అలాంటి ఫీలింగ్.. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ చెప్పిన హైపర్ ఆది


Also Read : Avatar 2 Box Office Collections : అవతార్ 2 సునామీ.. కలెక్షన్లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook