Shiva Shankar Master: ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్(Shiva Shankar Master) అంత్యక్రియలు ముగిశాయి. కరోనాతో పోరాడుతూ..శివశంకర్ ఆదివారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం(Mahaprasthanam)లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shiva Shankar Master passes away : డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ ఇకలేరు


పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు. ప్రముఖ నటుడు, వ్యాఖ్యాత ఓంకార్(Anchor Omkar) తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.  శివ శంక‌ర్ మాస్ట‌ర్‌తో ఓంకార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కొన్ని టీవీ షోస్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజు గారి గది 3'లో శివ శంకర్ మాస్టర్ నటించిన సంగతి తెలిసిందే. 


హీరో రాజశేఖర్(hero Rajasekhar) మాట్లాడుతూ.."నా కెరీర్ ప్రారంభం నుంచి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎన్నో సాంగ్స్ చేశాను. ఆయన గొప్ప మాస్టర్. ఆయన మృతి ఇండస్ట్రీకి పెద్ద లోటు" అని అన్నారు. శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రాజమౌళి, సోనూ సూద్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook