Kalki 2898AD Update: సలార్ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ నటీ నటులు నటించబోతున్నట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కీలక పాత్రల సంగతి పక్కన పెడితే సినిమాలో క్యామియో పాత్రలలో కూడా కొందరు స్టార్లు కనిపించనున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించబోతున్నారు.. అని చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్, లెజెండరీ నటి శోభనలు కూడా సినిమాలో కనిపించబోతున్నారు..అని వార్తలు మొదలయ్యాయి. 


ఇక మృణాల్ ఠాకూర్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో సినిమాకి సంబంధించిన అప్డేట్ షేర్ చేయడంతో.. ఈ వార్తలలో నిజం ఉంది అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఇక సినిమాలో నటిస్తుందో లేదో తెలియకుండానే.. మృణాల్ సినిమాని తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేస్తుంటే.. మరోవైపు సినిమాకి మెయిన్ హీరోయిన్ అయిన దీపికా పడుకొనే సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా.. సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు అని.. కొందరు అభిమానులు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


ఈ సంగతి పక్కన పెడితే.. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగానే ఉంటున్న శోభన కూడా.. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను..పలకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సీనియర్ హీరోలు అందరితోనూ నటించి హిట్లు అందుకున్న శోభనను దాదాపు 18 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇప్పుడు వెండితెరపై చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. క్యామియో పాత్రల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ బ్యూటీ డిశా పటాని, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ నటుడు పశుపతిలతో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.


Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter