Shocking Price for Mahesh Babu-Trivikram SSMB28 Aarambham Non theatrical Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ 28వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఆరంభం అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మొదటి షెడ్యూల్లో పలు యాక్షన్ సీక్వెన్స్ లను త్రివిక్రమ్ తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండవ షెడ్యూల్ వాస్తవానికి దసరా సెలవులు తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు. కానీ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించడంతో మహేష్ మళ్ళీ ఎప్పుడు సెట్స్ కు వస్తారనే విషయంలో కాస్త సందిగ్ధత ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా పూర్తిగా షూటింగ్ కూడా జరుపుకోకుండానే సినిమా ఆడియో, డిజిటల్, శాటిలైట్ సహా ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాధారణంగానే త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా క్రేజ్ ఉంటుంది. దానికి తోడు ఒక సూపర్ హిట్ ఒక యావరేజ్ సినిమాలు అందుకున్న మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం, ప్రస్తుతానికి త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరూ హిట్లతో ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని ప్రచారం జరుగుతోంది.


ఇప్పటికే శాటిలైట్ ఛా,నళ్లు ఓటీటీ ప్రొవైడర్లు ఈ సినిమాకు భారీగా హక్కులు చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటే సినిమా మేకర్స్ ఇంకా భారీగా రేట్లు చెబుతున్నారట. సినిమా అవుట్ ఫుట్ ఒకసారి చూస్తే మేము చెప్పిన రేట్లకు కొనుక్కోవడానికి మీకు ఏమీ ఇబ్బంది ఉండదని కావాలంటే అప్పటి వరకు వేచి చూసి కొనుక్కోవచ్చని ధైర్యంగా చెబుతున్నారట. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు.


కానీ సినిమా షూటింగ్ కూడా సరిగా ప్రారంభం కాకముందే ఈ విధంగా హక్కుల కోసం డిమాండ్ ఏర్పడిందంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని మహేష్ అభిమానులైతే నమ్ముతున్నారు. అయితే మహేష్ జీవితంలో 2022 మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు. ఆయన సోదరుడు రమేష్ బాబుతో పాటు తల్లి ఇందిరా దేవి కూడా కన్న మూయడం మహేష్ కు మహేష్ కుటుంబానికి తీవ్ర విషాదం అనే చెప్పాలి..


Also Read: Ponniyan Selvan 1 First Review: సినిమా సూపరంటూ ఫస్ట్ రివ్యూయర్ హల్చల్.. అసలు నువ్వెవరంటూ షాకిచ్చిన సుహాసిని!


Also Read: Allu Studios By Chiranjeevi: మెగాస్టార్ చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ఓపెనింగ్.. ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook