Family Star Run Time


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస డిజాస్టర్ లతో సతమతమైన యువ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు విజయ్ ఫామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది


అయితే తాజాగా ఇప్పుడు సినిమా రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రన్ టైం ఎక్కువగా ఉన్న కూడా సినిమాలకి అదే మైనస్ పాయింట్ గా మారిపోతోంది. అయితే ఫ్యామిలీ స్టార్ విషయంలో అదే జరగనుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైం రెండు గంటల 40 నిమిషాలు. సినిమా బాగానే ఉంటే రన్ టైం విషయంలో ఇబ్బంది రాకపోవచ్చు కానీ సినిమాకి కొంచెం నెగటివ్ టాక్ వచ్చినా కూడా రన్ టైం ఇంకా పెద్ద మైనస్ పాయింట్ గా మారిపోతుంది. 


ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ దేవరకొండ కెరియర్ కి కీలకం. ఎందుకంటే గీతా గోవిందం చిత్రం తర్వాత ఈ హీరోకి ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు. ఖుషి విజయం సాధించిన ఆ క్రెడిట్ మొత్తం సమంతా కి పోయింది. కాబట్టి ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయితే తప్పకుండా విజయ్ దేవరకొండ మార్కెట్ పరిపోవడం ఖాయం. అందులో విజయ్ అభిమానులంతా ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. గీతా గోవిందం దర్శకుడు మరోసారి తమ హీరోకి సూపర్ హిట్ అందిస్తారని నమ్మకంతో ఉన్నారు.


అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా రన్ టైం ఇంతలా పెట్టి విజయ్ దేవరకొండ రిస్క్ తీసుకుంటున్నాడా అని అభిమానులు భయపడుతున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని టీ సిరీస్ వారు సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.


Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక


Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌



 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook