Leo Movie Latest Updates: కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న "లియో" సినిమా గురించి తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమానే లియో. అందుకే ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా గురించిన ఎలాంటి వార్త అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో సినిమా కథ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త కూడా ఇప్పుడు ప్రేక్షకులు దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్, విజయ్ తండ్రి పాత్రలకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుందట. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒక సంఘటన సినిమాకి కీలకమైన సన్నివేశంగా మారుతుందట.


అది సినిమాకే అతిపెద్ద ట్విస్ట్ గా కూడా నిలుస్తుంది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సినిమాలో తండ్రి కొడుకులు సెంటిమెంట్ ఉంటుందా లేదా ఈ సన్నివేశం సినిమాకి ఎలాంటి ట్విస్ట్ అవుతుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పలని సామి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


అనిరుధ్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పలు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. మరి ఖైదీ, విక్రమ్ సినిమాల లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు ఇప్పటినుంచే జోష్యం చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో విజయ్ నటించిన "వారసుడు" సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం అంతంత మాత్రం గానే నిలిచింది. కానీ లియో సినిమా మాత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.