Shraddha Clarifies Bigg Boss-4: హీరోయిన్ శ్రద్ధాదాస్‌ ( Shraddha Das ) కు కోపం వచ్చింది. బిగ్‌బాస్ 4 కారణంగా.. కోర్టుకు వెళతానని హెచ్చరిస్తోంది. ఎందుకనుకుంటున్నారు.. కదా.. అయితే ఇది చదవండి. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో (Bigg Boss Telugu Season-4) త్వరలో ప్రారంభమవుతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఫలానా వాళ్లు అంటూ పలు పేర్లు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ కంటెస్టెంట్స్‌లో శ్రద్ధాదాస్ కూడా ఉందంటూ వార్తలు రావడంతో మొదట శ్రద్ధాదాస్ ఖండించింది. అయినా.. ఈ ప్రచారం ఆగకపోవడంతో బిగ్‌బాస్ 4 గురించి వివరణ ఇస్తూ.. ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. Also read: ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు



ఈ మేరకు శ్రద్ధాదాస్ ట్విట్టర్‌లో ఇలా రాసింది..‘‘తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను చూసి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వార్త‌లు రాసేముందు క్లారిటీ తీసుకుంటే బావుంటుంది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. లేకపోతే చట్టపరమైన చ‌ర్య‌లు తప్పవు’’ అంటూ శ్ర‌ద్ధాదాస్ రాసింది‌. అయితే ఇంత క్లారిటీ ఇచ్చినా.. మరి ముందు ఇలాంటి వార్తలకు పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి. Also read: RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..