Chaitanya Master Suicide ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్‌ నిన్న నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల బాధలు ఎక్కువయ్యాయ్ అని, భరించలేకపోతోన్నాను అని, అందరూ తనను క్షమించాలని కోరుతూ ఉరేసుకుని చనిపోయాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో శ్రద్దా దాస్ స్పందిస్తూ ఎమోషనల్ అయింది. చైతన్య మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుట్టుక, చావు అనేది ఓ జీవిత చక్రంలో భాగం.. అవి ఎందుకు జరుగుతాయో అర్థం కావు.. కానీ ఈ చావు పుట్టుకలా మధ్య మనం ఎలా బతికాం అన్నదే మనల్ని గొప్ప వారిలా చేస్తుంది.. ఇక నిజంగా చెప్పాలంటే.. చైతన్య మాస్టర్ ఎంతో మంచి వ్యక్తి.. మంచి మనసున్న వ్యక్తి.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్


నువ్వు కోరుకున్న ఫైనల్ డెస్టినేషన్‌కు నువ్వు చేరుకోవాలని కోరుకుంటున్నాను.. నీ చిరునవ్వే అందరికీ గుర్తుండిపోతుంది.. కానీ ఈ రోజు మాత్రం నువ్వు చాలా ఏడిపించావ్.. నీ నవ్వునే మేం గుర్తుంచుకుంటాం అని ఇలా శ్రద్దా దాస్ ఎమోషనల్ అయింది. ఆమె వేసిన పోస్ట్, షేర్ చేసిన వీడియో అందరినీ కదిలిస్తోంది.


[[{"fid":"271418","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అప్పులు ఎక్కువయ్యాయ్ అని, తప్పు మీద తప్పులు చేశానని, ఇప్పుడు అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేస్తున్నానంటూ చైతన్య మాస్టర్ తన చివరి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఢీ షో అయితే పేరు, క్రేజ్ ఇచ్చింది కానీ.. డబ్బులు మాత్రం ఇవ్వలేదని అన్నాడు. ఢీ షోలో తక్కువ ఇస్తారని, అదే జబర్దస్త్ వంటి షోల్లో ఎక్కువగా డబ్బు ఇస్తారని చెప్పుకొచ్చాడు. దీంతో ఢీ షో రెమ్యూనరేషన్‌ల మీద మరోసారి చర్చలు మొదలయ్యాయి. మల్లెమాల సంస్థ మీద మళ్లీ ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి.


Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook