Shraddha Walkar Gold Ring found From Aftab New Girlfriend: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు మరో కీలక విషయాన్ని రాబట్టారు. ఇప్పటివరకు మిస్ అయిన శ్రద్ధా వాకర్ ఉంగరాన్ని పోలీసులు కనుగొన్నారు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడని తేల్చారు. శ్రద్ధా హత్య కేసులో ఇదొక కీలక సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి పరిస్థితిలో, అఫ్తాబ్ అమీన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏమి చెబుతుంది అనేది కూడా ముఖ్యమే అని అంటున్నారు. ఇది కాకుండా మరోవైపు, గూస్‌బంప్స్‌ తెప్పించే మరో విషయం కూడా తెరపైకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధా తల శరీరం నుంచి వేరు చేసిన తర్వాత జుట్టును కత్తిరించాడని పోలీసులు గుర్తించారు. ఛత్తర్‌పూర్ అడవుల్లో శ్రద్ధ వెంట్రుకలను పోలీసులు గుర్తించారు. శ్రద్ధా జుట్టు కూడా ఆమె తండ్రి DNAతో సరిపోయింది.


ఇక శ్రద్ధా బంగారు ఉంగరం ధరించేదని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత ఉంగరాన్ని తన వద్దే ఉంచుకున్న నిందితుడు అఫ్తాబ్ ఈ ఉంగరాన్ని తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి బహుమతిగా ఇచ్చాడని, శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేరం జరిగిన ఛత్తర్‌పూర్ ఫ్లాట్‌కు అఫ్తాబ్ పిలిచి రొమాన్స్ చేసిన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆమేనని పోలీసులు గుర్తించారు. దక్షిణ జిల్లా పోలీసులు ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ ని విచారణకు పిలిచారు. ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు అఫ్తాబ్‌ను కలవడానికి ఫ్లాట్‌కి వెళ్లినప్పుడు అఫ్తాబ్ తనకు ఈ ఉంగరం బహుమతిగా ఇచ్చాడని ఆమె చెప్పినట్టు వెల్లడించారు.


ఇక ఈ ఉంగరాన్ని గుర్తించేందుకు పోలీసులు శ్రద్ధ తండ్రికి చూపించగా శ్రద్ధా తండ్రి ఈ ఉంగరాన్ని శ్రద్ధాకు బహుమతిగా ఇచ్చాడు. శ్రద్ధా పుట్టినరోజు సందర్భంగా ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడని వెల్లడించారు. ఇక  అఫ్తాబ్ మొదట శ్రద్ధ తల నరికి చంపాడని, ఆపై కత్తెరతో ఆమె తలపై వెంట్రుకలను కత్తిరించాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ వెంట్రుకలను కత్తిరించి ప్యాకెట్‌లో ఉంచగా ఛత్తర్‌పూర్ అడవుల్లో పోలీసులు ఈ ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ వెంట్రుకలను డీఎన్‌ఏ పరీక్షకు పంపారు.


Also Read: Prabhas Love : ప్రభాస్ మనుసులో కృతి.. అసలు విషయం లీక్ చేసేసిన వరుణ్ ధావన్!  


Also Read: Puri Jagannadh : లైగర్‌ ఎఫెక్ట్.. చాలా రోజులకు పూరి జగన్నాథ్ చిల్.. పిక్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook