Shraddha Walker murder case is Reason for Tunisha Sharma Suicide: హిందీ టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో ఆమె పోస్ట్‌మార్టం నివేదిక తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సహనటుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు నాలుగు రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయంలో తునీషా తల్లి చేస్తున్న కామెంట్లు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అయితే ఇంతలోనే ఈ కేసులో నిందితుడు అని భావిస్తున్న షీజన్ ఖాన్ తల్లి స్టేట్మెంట్ కూడా తెరపైకి వచ్చింది. ఆమె మాట్లాడుతూ తునీషా చాలా మంచి పిల్ల అని ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేనని, ఆమె నా బిడ్డలాంటిదని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో పోలీసులు తన పని తాను చేసుకుపోతున్నారని నా కుమారుడు షీజన్ కూడా పోలీసులకు సహకరిస్తున్నాడని ఇది చాలా పెద్ద విషయం, నిజం అందరికీ త్వరలోనే తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తునీషాతో షీజన్ ఎందుకు విడిపోయాడు? 
అయితే పోలీసుల ఇంటరాగేషన్‌లో తునీషాతో విడిపోవడానికి గల కారణాన్ని కూడా షీజన్ వెల్లడించడం అందరినీ షాక్‌కు గురి చేసిందని అంటున్నారు. అసలు తునీషాతో ఎందుకు విడిపోయారని షీజన్ ను పోలీసులు ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా శ్రద్దా వాకర్ హత్య కేసు తర్వాత తునీషా చాలా ఒత్తిడిలో ఉందని నిందితుడు పోలీసులకు చెప్పాడని అంటున్నారు.


శ్రద్ధా హత్య కేసు తర్వాత, సోషల్ మీడియాలో, టీవీలలో జరుగుతున్న చర్చల కారణంగా ఆమె టెన్షన్ పడేదని అతను పేర్కొన్నారు. వయసు, మతం కారణంగా నేను తునీషాతో పెళ్లికి నిరాకరించానని, బ్రేకప్ చెప్పానని షీజన్ చెప్పాడు.


తునీషా తన తల్లి వద్ద ఏం చెప్పింది? 
తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు, తన హృదయంలో ఒక విషయం అమ్మా నాకు షీజన్ కావాలి అని చెప్పిందని తునీషా శర్మ తల్లి చెప్పారు. తునీషా తన తల్లికి 'షీజన్ తన జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నానని మీరు షీజన్‌తో ఒకసారి మాట్లాడతారా? అని కోరిందని, ఈ క్రమంలో తునీషా తల్లి షీజన్‌కు ఫోన్ చేసి, మళ్లీ తన కుమార్తె జీవితంలోకి తిరిగి రావాలని కోరిగా షీజన్ 'నన్ను క్షమించు' అని అన్నారని తెలుస్తోంది.  


ఆత్మహత్యకు ఒకరోజు ముందు నుంచే నిరాహారదీక్ష?
ఇక ఆత్మహత్యకు ఒకరోజు ముందు తునీషా ఏమీ తినలేదని, తాగలేదని షీజన్ పోలీసులకు తెలిపాడు. ఘటన జరిగిన రోజున ఆమెకు ఆహాయం తినిపించడానికి షీజన్ ప్రయత్నించాడు, కానీ ఆ రోజు కూడా నటి ఏమీ తినలేదు. షీజన్ మాట్లాడుతూ - తునీషాను సెట్‌లో కెమెరా వద్దకు రమ్మని అన్నారు. అయితే ఆమె తర్వాత వస్తానని చెప్పింది. చాలా సేపటి తర్వాత కూడా తునీషా సెట్‌కి రాకపోవడంతో నేనే మేకప్ రూమ్‌కి వెళ్లి తలుపు తట్టానని, అయినా సమాధానం రాకపోవడంతో, నేను ఇతరులతో కలిసి తలుపు పగలగొట్టానని, అప్పుడు తునీషా లోపల ఉరివేసుకుని ఉంది, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించామని చెప్పినట్టు తెలుస్తోంది. 


గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించిన తునీషా?  
తునీషా ఆత్మహత్య కేసులో నిందితుడైన షీజన్ పోలీసుల విచారణలో ఈ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు తునీషా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, అయితే ఆ సమయంలో తాను ఆమెను రక్షించానని పోలీసులకు తెలిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ విషయాన్ని తునీషా తల్లికి కూడా చెప్పినట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది.  ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 3 గంటలకు షీజన్, తునీషా కలిసి మేకప్ రూమ్‌లో భోజనం చేసినట్లు విచారణలో తేలగా భోజనం చేసిన 15 నిమిషాలకే తునీషా ఆత్మహత్య చేసుకుందని, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. 


Also Read: Neha Sharma Bikini Photos: గోవా బీచ్లో నేహా శర్మ బికినీ ట్రీట్.. మందారంలో మెరిసిపోతోందిగా!


Also Read: Kajal Aggarwal Lip Kiss: కొడుకు పక్కనుండగానే భర్తకు కాజల్ లిప్ లాక్.. ఫోటో వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.