Ravi Teja Shruti Hassan movies: సినిమా ఇండస్ట్రీలో బంధుత్వాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక సినిమాలో హీరో సరసన హీరోయిన్ గా కనిపించిన ఒక హీరోయిన్ మరొక సినిమాలు అక్క పాత్రలో.. వదిన పాత్రలో కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ విషయంలో కూడా ఇలాగే జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు రవితేజ సరసన హీరోయిన్గా కనిపించిన హీరోయిన్.. సడన్గా రవితేజ కి వదిన పాత్రలో ప్రత్యక్షమైంది. ఆమె మరెవరో కాదు శృతిహాసన్. మొట్టమొదటిసారిగా 2013లో బలుపు అనే సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా కనిపించింది శృతిహాసన్. ఆ సినిమాలో వీళ్ళిద్దరూ ప్రేమికుల లాగా కనిపించారు.


ఆ తరువాత 2021 లో వచ్చిన క్రాక్ సినిమాలో శృతిహాసన్ రవితేజ భార్య పాత్రలో కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం శృతిహాసన్ రవితేజ వదిన పాత్రలో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటించారు. చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాలు రవితేజ చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు. అలా వరుస ప్రకారం చూస్తే రవితేజ కి శృతిహాసన్ వదిన అవుతుంది అన్నమాట. అలా రెండు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన శృతిహాసన్ రవితేజ కి వదినగా మారిపోయింది. 


మరోవైపు రవితేజ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. ఆసక్తికరంగా శృతిహాసన్ హీరోయిన్గా కనిపించిన క్రాక్ సినిమాతో ఆఖరి హిట్ అందుకున్న రవితేజ.. మళ్లీ సోలో హీరోగా హిట్ అందుకోలేదు. ఈ మధ్యన విడుదలైన మిస్టర్ బచ్చన్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా విడుదలైంది. 


భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ అందుకుంది. థియేటర్లలో ఏమాత్రం వసూళ్లు చేయలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు త్వరలో ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతుంది. ఇక ఈ మధ్యనే సినిమాలతో బిజీ అవుతున్న శృతిహాసన్ ఆఖరిసారిగా ప్రభాస్ సరసన సలార్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా రెండవ భాగంలో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించనుంది.


Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల


Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.