Shruti Haasan Breakup శ్రుతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా శంతనుతో కలిసి శ్రుతి హాసన్ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కరోనా సమయంలోనూ ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. ముంబైలో సపరేట్‌గా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక శ్రుతి హాసన్, శంతను కలిసి చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఇద్దరికీ ఎయిర్ పోర్ట్ అయినా, నడి రోడ్డు అయినా, సూపర్ మార్కెట్ అయినా, నట్టిళ్లు అయినా ఒకటే. ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తారు. హగ్గులు, కిస్సులు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అయితే శ్రుతి హాసన్ తన కెరీర్ ప్రారంభంలో హీరో సిద్దార్థ్‌తో ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత చాలా ఏళ్లకు ఫోటో గ్రాఫర్ మైఖెల్ కోర్స్లేతో ప్రేమలో పడింది. అతని కోసం ఏకంగా సినిమాలను కూడా వదలుకుంది. 


 



మైఖేల్ నిజ స్వరూపం తెలియడంతో శ్రుతీ హాసన్ బ్రేకప్ చెప్పేసింది. తనను కంట్రోల్ చేయాలని చూశాడని అందుకే బ్రేకప్ చెప్పానంటూ శ్రుతి హాసన్ తెలిపింది. ఇక ఆ తరువాత మళ్లీ కొన్ని రోజులకు శంతనుతో ప్రేమలో పడింది శ్రుతి హాసన్. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉందని అనుకున్న సమయంలో ఏదో తేడా కొట్టేసినట్టుంది.


తాజాగా శ్రుతి హాసన్ వేసిన పోస్ట్ అనుమానాలకు దారి తీస్తోంది. నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే నాకు బాగుంటుంది.. నాతో నేనే సరదాగా ఉండగలను.. నా టైం విలువ నాకు తెలుసు.. నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను అనేది నేను రియలైజ్ అయ్యాను.. నేడు నాకున్న ఈ స్థాయి ఎంతో అదృష్టంగా భావిస్తాను అంటూ ఇలా చెప్పుకుంటూపోయింది. అంటే శంతనుతో శ్రుతి హాసన్‌కు ఏదో గొడవ అయినట్టుందని, అందుకే ఇలా పోస్ట్ వేసి ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.


Also Read : Ariyana Glory Photoshoot : అంతా కనిపించేస్తోందిగా.. అరుపులు పుట్టించేస్తోన్న అరియానా


Also Read : Trivikram Mahesh Babu : SSMB 28 అప్డేట్.. అన్నీ మార్చినా పూజా హెగ్డేను మాత్రం మార్చని గురూజీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook