Shruti Haasan Lover Birthday శ్రుతి హాసన్, ఆమె ప్రియుడు శంతను కలిసి ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగేళ్లుగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. వీరి డేటింగ్‌కు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌ అవుతుంటాయి. శంతను హజారిక ఓ అస్సామీ. శంతను ముంబైలో ఓ ఆర్టిస్ట్. శంతను, శ్రుతి హాసన్‌ల ప్రేమ కథకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. మామూలుగా అయితే శ్రుతి హాసన్ పెళ్లి మీద అనేక రూమర్లు వస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రుతి హాసన్ మాత్రం పెళ్లి మీద ఎప్పుడూ లైట్‌గానే స్పందిస్తుంటుంది. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పటికి అయితే లేదన్నట్టుగా స్పందిస్తుంటుంది. శంతను, శ్రుతి హాసన్‌ల పెళ్లి మీద రూమర్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే శ్రుతి హాసన్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా తన సినిమా కెరీర్ మీదే దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.


సినిమా షూటింగ్‌లు లేకపోతే మాత్రం వచ్చి శంతను ఒళ్లో వాలుతుంది. శంతను మీదున్న ప్రేమను ఎప్పటికప్పుడు శ్రుతి హాసన్ బయట పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు శంతను బర్త్ డే సందర్భంగా శ్రుతి హాసన్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో శ్రుతి హాసన్‌ ముద్దుల వర్షాన్ని కురిపించింది.


 



హ్యాపీ బర్త్ డే డ్రీమ్ బాయ్.. నా ఊహల్లో ఉండే వ్యక్తి.. నువ్ అరుదైన, అందమైన మనసున్న వ్యక్తివి.. ఎంతో స్వచ్చమైన వ్యక్తివి.. నీ దయాగుణం, నీ బ్రిలియెన్స్‌తో నన్ను ప్రతీ రోజూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటావ్..  నీ కలలన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను.. నేను నీ జీవితంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది.. నా ప్రేమను ఎప్పుడూ నీపై చూపిస్తాను.. శంకు నువ్ నాకు దొరకడం నా అదృష్టం అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook