Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Ram Charan Birthday Celebrations రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్‌ ఓ రేంజ్‌లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్‌ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 08:18 AM IST
  • చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్
  • టాలీవుడ్, శాండల్ వుడ్‌ నుంచి ప్రముఖులు
  • కనిపించని నందమూరి ఫ్యామిలీ?
Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Chiranjeevi Invites Whole Tollywood చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నాడు. తన కొడుకు ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. తన కొడుకు అద్బుతంగా డ్యాన్స్ చేసిన పాటకు ఆస్కార్ అవార్డు రావడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో తన కొడుకు నటించిన పాత్ర గురించి హాలీవుడ్ మేకర్లు మాట్లాడటం, ఆస్కార్ వేదిక మీద, అంతర్జాతీయ మీడియాలోనూ తన కొడుకు పేరు వినిపిస్తుంటే ఏ తండ్రికి మాత్రం ఆనందం, సంతోషం, గర్వకారణం కాకుండా ఉంటుంది. 

ఇప్పుడు చిరంజీవి అదే మూడ్‌లో ఉన్నాడు. రామ్ చరణ్‌ను చూసి ఎంతో గర్విస్తున్నాడు. అందుకే ఈ సారి బర్త్ డే వేడుకులను చిరంజీవి ప్రత్యేకంగా తన ఇంట్లో ఏర్పాటు చేశాడు. మొత్తం టాలీవుడ్‌ను ఆహ్వానించినట్టుగా కనిపిస్తోంది. కన్నడ నుంచి స్టార్ మేకర్లు సైతం వచ్చారు. ప్రశాంత్ నీల్, నార్తన్‌లను కూడా ఈ బర్త్ డే వేడుకల్లో మెరిశారు. ఈ ఇద్దరితోనూ రామ్ చరణ్ సినిమాలు తీయబోతోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు వచ్చాయి. కానీ నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎప్పటిలానే దూరంగా ఉంది. కనీసం ఎన్టీఆర్ అయినా వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రానట్టే కనిపిస్తోంది. ఎక్కడా ఫోటోలు, వీడియోలు కూడా కనిపించడం లేదు. మామూలుగా అయితే రామ్ చరణ్‌ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ వచ్చేది. కానీ ఈ వేడుకలకు ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య అయితే మెగా ఇంట్లో అడుగు పెట్టడన్న సంగతి తెలిసిందే.

ఇలా మరోసారి మెగా నందమూరి ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ చర్చలకు వస్తోంది. ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీకి దూరం మెయింటైన్ చేస్తూనే అల్లు ఫ్యామిలీకి మరింత దగ్గరవుతున్నాడు బాలయ్య. అల్లు ఫ్యామిలీ సైతం బాలయ్యను ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణం కూడా మెగా, అల్లు కాంపౌండ్‌లకు దూరం పెంచినట్టుగా అనిపిస్తోంది.

Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్

Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News